Pic Source: Twitter

కడుపు నొప్పి చాలా సాధారణ సమస్య. చాలా సార్లు, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల, కడుపు నొప్పి వస్తుంది. కొందరు కడుపునొప్పికి మందు వేసుకుంటారు లేదా ఎక్కువ సమస్య వస్తే మరికొందరు డాక్టర్ దగ్గరకు వెళతారు. ఇటీవల ఓ యువకుడు కడుపునొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లగా, అతడి రిపోర్టును చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వైద్యులు పరీక్షించి చూడగా కడుపులో స్టీల్‌ గ్లాస్‌ ఇరుక్కుపోయిందని తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఈ కేసు బీహార్‌లోని బెట్టియాకు చెందినది. 22 ఏళ్ల యువకుడికి కొద్ది రోజుల క్రితం విపరీతమైన కడుపునొప్పి వచ్చి మలద్వారం నుంచి రక్తం రావడం మొదలైంది. విషయం తీవ్రతను చూసి వెంటనే పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతన్ని పరీక్షించగా, అతని కడుపులో 14 సెంటీమీటర్ల (5.5 అంగుళాలు) పొడవైన స్టీలు గ్లాసు ఇరుక్కుపోయిందని నివేదిక వెల్లడించింది. దాని కారణంగా అతని మలద్వారం నుండి రక్తం రావడం ప్రారంభమైంది.

రెండున్నర గంటల ఆపరేషన్ చేసి డాక్టర్లు అతడి కడుపులో నుంచి గాజు గ్లాసును బయటకు తీశారు.  శస్త్రచికిత్సకు నాయకత్వం వహించిన డాక్టర్ ఇంద్ర శేఖర్ కుమార్ మాట్లాడుతూ, 11 మంది వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించిందని  శరీరంలోని స్టీల్ గ్లాస్‌ను విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు.

Odisha Shocker: తాగిన మత్తులో స్నేహితుడిపై దారుణం, బట్టలిప్పి వెనక భాగంలో గాజు గ్లాస్ తోసేశారు, 10 రోజుల తర్వాత నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి పరుగులు పెట్టిన బాధితుడు

యువకుడి శరీరంలోని గ్లాసును తొలగించేందుకు కొలోస్టోమీ నిర్వహించారు. పేగులో రంధ్రం చేసి బ్యాగ్ అమర్చి చేసే శస్త్రచికిత్స ఇది. తద్వారా గాయం మానుతుంది.

యువకుడు మద్యం మత్తులో ఉన్నప్పుడు, అతని శరీరంలో ఈ స్టీల్ గ్లాస్ చొప్పించబడి ఉంటుందని, అందువల్ల అతనికి ఏమీ గుర్తు లేదని వైద్యులు పేర్కొంటున్నారు.