WiFi Railway Stations: భారతదేశంలోని 6500 రైల్వే స్టేషన్‌లలో వైఫై సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఇండో-స్వీడిష్ టెక్నాలజీకి పరస్పర సహాకారం కోసం స్వీడన్‌లో పర్యటిస్తున్న మంత్రి

స్వీడన్ -ఇండియా ఆవిష్కరణలను ఎలా ఉపయోగించవచ్చు, భారతీయులకు మరియు వారి నుంచి ప్రపంచ దేశాలకు ఎలా సేవలను విస్తరించవచ్చు అనే వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి....

Wifi at stations (Image: PTI)

Stockholm, October 23: 2020 నాటికి భారతదేశంలోని మొత్తం 6500 స్టేషన్లు వై-ఫై (Wi-Fi) ఎనేబుల్ అవుతాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం భారతదేశంలో 5150 రైల్వే స్టేషన్లలో ఇప్పటికే వైఫై సదుపాయం కల్పించబడిందని తెలిపిన మంత్రి, మరో 6-8 నెలల్లో 5500 రైల్వే స్టేషన్లు వైఫై జోన్ పరిధిలోకి విస్తరిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగిన ఇండియా- స్వీడన్ బిజినెస్ లీడర్స్ రౌండ్ టేబుల్ సందర్భంగా పలు కార్పోరేట్ కంపెనీల సిఇఓలను ఉద్దేశించి గోయల్ ప్రసంగించారు. ఇండియా-స్వీడన్ ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఆయన వివరించారు. ఏదైనా స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ముందు ప్రభుత్వం దేశీయ పరిశ్రమ మరియు భారత ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటుందని గోయల్ చెప్పారు.  మీ బెర్త్ కన్ఫర్మ్! ఇక వెయిటింగ్ లిస్టులు, వెయిట్ చెయ్యడాలు ఉండవు.

" మేడ్ ఇన్ స్వీడన్ ఖరీదైనది, కానీ అదే టెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా అయితే ఖర్చు తక్కువవుతుంది. స్వీడన్ -ఇండియా ఆవిష్కరణలను ఎలా ఉపయోగించవచ్చు, భారతీయులకు మరియు వారి నుంచి ప్రపంచ దేశాలకు ఎలా సేవలను విస్తరించవచ్చు అనే వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి" అని గోయల్ పేర్కొన్నారు.

పియూష్ గోయల్ ప్రకటనకు సంబంధించిన ట్వీట్

ఇండియా- స్వీడన్ దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక మరియు టెక్నాలజీలకు సంబంధించిన పరస్పర సహాకారానికి ఉద్దేశించబడిన  ( Indo-Swedish Joint Commission) సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్టాక్‌హోమ్‌లో పర్యటిస్తున్నారు. వివిధ కంపెనీల సీఈవోలు పాల్గొంటున్న ఈ సమావేశానికి ఈ సమావేశానికి స్వీడన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అన్నా హాల్బర్గ్ మరియు భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మరియు మంత్రి పియూష్ గోయల్ అధ్యక్షత వహిస్తున్నారు.

నివేదికల ప్రకారం, గ్రీన్ టెక్నాలజీస్, పునరుత్పాదక ఇంధనం, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ మరియు రక్షణ వంటి ముఖ్య రంగాలలో ఈ సమావేశం భారత్- స్వీడన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.