Landslides Hit Kerala's Wayanad: కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది.. సహాయక చర్యలు ముమ్మరం

కేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

Landslides Hit Kerala's Wayanad

Newdelhi, July 30: కేరళలో (Kerala) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు (Landslides Hit Kerala's Wayanad) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకొన్నారు. సమాచారం అందుకున్న కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెప్పారు. కేరళలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులకు ఓ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాల భవనంతో పాటు.. పలు ఇళ్లు బురదలో కూరుకుపోయాయి.

జార్ఖండ్‌ లో హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 18 బోగీలు.. ఒకరు మృతి.. 60 మందికి గాయాలు

రెండు దశల్లో ప్రమాదం..

సోమవారం అర్థరాత్రి దాటాక ఒంటి గంటకు ఒకసారి, మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డట్టు స్థానికులు చెప్తున్నారు. దీని ప్రభావం దాదాపు 400 కుటుంబాలపై ఉన్నట్టు అధికారులు తెలిపారు.ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నెంబర్లను సంప్రదించవచ్చునని తెలిపింది.

ఖాళీ కడుపుతో ఈ 3 ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Advertisement
Share Now
Advertisement