ఆరోగ్యమైన జీవనశైలితో పాటు ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలామంది కొన్ని ఉదయాన్నే కొన్ని పొరపాట్లు చేస్తారు. అవి తగ్గించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది ప్రజలు ఉదయాన్నే టీ కాఫీతో ప్రారంభిస్తారు. ఇందులో ఉండే కెఫెన్ నిద్రమత్తును తొలగిస్తుంది కానీ ఇది ప్రేగులకు చాలా హానికరం. కాబట్టి ఖాళీ కడుపుతో తీసుకోకుండా ఏదైనా టిఫిన్ తర్వాత కాఫీ టీలు తీసుకున్నట్లయితే ఇది మీ కడుపును ఇబ్బంది పెట్టదు.
పెరుగు: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో పెరుగు తీసుకున్నట్లయితే మన ప్రేగుల్లో ఉన్న ఎసిడిక్ నేచర్ ను తగ్గిస్తుంది. దీని ద్వారా మనకు కడుపునొప్పి, లూస్ మోషన్స్ ఏర్పడతాయి.
జ్యూస్: ఉదయాన్నే పండ్ల జ్యూస్ ,ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ ఖాళీ కడుపుతో తీసుకోకూడదు, ఇది మన జీర్ణ వ్యవస్థ పైన ,కాలేయం పైన చెడు ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మీరు డయాబెటిక్ పేషెంట్ అయినట్లయితే కాళీ కడుపుతో తీసుకుంటే ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే దీనిలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది, కాబట్టి ఇది మిమ్మల్ని తీవ్ర అనారోగ్యం పాలు చేస్తుంది.
స్పైసీ ఫుడ్స్: ఉదయాన్నే కాళీ కడుపుతో స్పైసి ఫుడ్ తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది కడుపునొప్పి అజీర్ణంతో పాటు ఎసిడిటీ సమస్యను కలిగిస్తుంది. దీనిద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరగకపోవడంతో వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఖాళీ కడుపుతో ఏ పదార్థాలు తీసుకోవాలి.
గోరువెచ్చని నీరు: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒకటి రెండు క్లాసుల గోరువెచ్చని నీరును త్రాగాలి. ఇది మన జీర్ణ క్రియను మెరుగుపరిస్తోంది. అంటే కాకుండా మనం మెటబాలిజం లో వేగవంతంగా చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు కావాలంటే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ ,తేనె కలిపి తీసుకున్నట్లయితే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పోయి ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
హెర్బల్ టీ: ఉదయం నిద్ర లేవగానే కాఫీ టీలకు బదులుగా హెర్బల్ టీలు తీసుకున్నట్లయితే మీ జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. తులసిటి కనుక ప్రతిరోజు ఉదయం తీసుకున్నట్లయితే మీ జీర్ణ క్రియ వేగవంతం చేస్తుంది. మలబద్ధక సమస్య నుంచి బయటపడేస్తుంది. తులసిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
డేట్స్ : ఖాళీ కడుపుతో ప్రతిరోజు రెండు ఖర్జూరాలను తీసుకున్నట్లయితే ఇందులో విటమిన్ సి ఐరన్ ఫైబర్ వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇది మన శరీరానికి అనేక రకాలైన పోషకాలను అందిస్తుంది. ప్రతిరోజు రెండు ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా మనకు జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఇది మలబద్ధక సమస్య నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
బొప్పాయి: మీరు బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయి పండును తీసుకోవచ్చు. ఇది మన జీర్ణ క్రియను చక్కగా ఉంచుతుంది. ఇది ప్రోటీన్ లను విచ్చినం చేయడంలో సహాయపడుతుంది. కాళీ కడుపుతో 30 తీసుకున్నట్లయితే అజీర్ణము, గ్యాస్ కడుపుబ్బరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.