Wayanad, DEC 21: వాయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi Vadra) విజయాన్ని బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ (Navya Haridas) కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో తేడాలు ఉన్నాయని, ఆమె కుటుంబ ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. అంతేగాక ప్రియాంకాగాంధీ ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. అయితే డిసెంబర్ 23 నుంచి జనవరి 5 వరకు కేరళ హైకోర్టుకు (Kerala High Court) క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. సెలవుల అనంతరమే న్యవ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.
Karnataka: కర్ణాటకలో షాకింగ్ రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి...ట్రక్కు-వోల్వో కారును ఢీకొనడంతో ప్రమాదం
వాయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ దాదాపు 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్రమాలకు పాల్పడటం వల్లే ప్రియాంకాగాంధీ గెలిచారని నవ్య ఆరోపిస్తున్నారు. ఓటర్లను తప్పుదోవ పట్టించారని అన్నారు.