Siddipet, Dec 8: సిద్ధిపేట (Siddipet) జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను పరంధాములు(43), పూస వేంకటేశ్వర్లు(42) గా పోలీసులు గుర్తించారు. పరంధాములు సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా.. దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో పూస వేంకటేశ్వర్లు కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. జాలిగామ బైపాస్ వద్ద వీరి బైక్ ను ఓ వాహనం బలంగా ఢీకొట్టంది. దీంతో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, అనుమానిత వాహనం, దాన్ని నిడిపింది ఎవరన్నదన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Video:
హిట్ అండ్ రన్.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డుపై ప్రమాదం
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు స్పాట్ డెత్
మృతుల్లో ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పరంధాములుగా గుర్తింపు
మరొకరు దౌల్తాబాద్ పీఎస్ లో… pic.twitter.com/lnfg3vHuwC
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2024
మారథాన్ లో పాల్గొనాల్సి ఉండటంతో..
మృతులు పరంధాములు, పూస వేంకటేశ్వర్లు ఈసీఎల్ లో జరుగుతున్న మారథాన్ లో పాల్గొనాల్సి ఉంది. అక్కడ నిర్వహిస్తున్న రన్నింగ్ లో వీళ్లు ఇద్దరూ పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.