Birth Control Pill for Men: ఇకపై మగవాళ్లకు కూడా గర్భనిరోధక మాత్రలు, మరికొద్దిరోజుల్లో మార్కెట్లోకి ట్యాబ్లెట్స్, ఎలా వాడాలో తెలుసా?
వీల్ కార్నెల్ మెడిసిన్(Weill Cornell Medicine) పరిశోధకులు డెవలప్ చేసిన గర్భ నిరోధక మందు తాత్కాలికంగా స్పెర్మ్ ని దాన్ని ట్రాక్ లో నిలిపి వేస్తుందని, సంతానాన్ని నిలువరించే క్రమంలో వాళ్లు చేసిన ప్రీ క్లినికల్ టెస్ట్ లో ఈ విషయం తేలింది.
New Delhi, FEB 16: ఇది వైద్య పరిశోధనలో మరో ముందడగు అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడవాళ్లకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలోనే మగాళ్లకు కూడా సంతాన నిరోధక మాత్రలు (birth control pill for men) అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ప్రీ క్లినికల్ ట్రయల్స్ (Clinical trails) కూడా సక్సెస్ అయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొన్ని నెలల్లోనే మార్కెట్ లో మగాళ్లకు కూడా ఓ మాత్ర దొరుకుతుంది. అవాంఛిత ప్రెగ్నెన్సీని అడ్డుకోవడం కోసం ఆడవాళ్లు గర్భ నిరోధక మాత్రలు వాడుతుంటారు. ఇవి వారు గర్భం దాల్చకుండా అండాల తయారీని అడ్డుకుంటాయి. మరి, మగవాళ్లు. ఇదే ప్రశ్న కొన్నేళ్లుగా తలెత్తుతోంది. గర్భాన్ని నిరోధించేందుకు ఆడవాళ్లకు మాత్రలు ఎందుకు అందుబాటులో ఉన్నాయి. మగవాళ్ల కోసం ట్యాబ్లెట్స్ ఎప్పుడొస్తాయి? అనే చర్చ జోరుగా సాగుతోంది.
దీనికి సంబంధించి కొన్నేళ్లుగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడిదే విషయంలో ఓ అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఈ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మగవాళ్ల సంతాన నిరోధక మాత్రకు సంబంధించి ప్రీ-క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. వీల్ కార్నెల్ మెడిసిన్(Weill Cornell Medicine) పరిశోధకులు డెవలప్ చేసిన గర్భ నిరోధక మందు తాత్కాలికంగా స్పెర్మ్ ని దాన్ని ట్రాక్ లో నిలిపి వేస్తుందని, సంతానాన్ని నిలువరించే క్రమంలో వాళ్లు చేసిన ప్రీ క్లినికల్ టెస్ట్ లో ఈ విషయం తేలింది. దాంతో ఆన్ డిమాండ్ పురుషుల సంతాన నిరోధక మాత్ర సాధ్యమేనని నిరూపించింది. అవాంఛిత గర్భాలను నిరోధించడంలో ఇదే గేమ్ చేంజర్ కావొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
సెక్స్‌కు గంట ముందు వేసుకోవాలి..
”గర్భనిరోధం కోసం మహిళలు వాడే పిల్స్ వంటివే పురుషులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. సాల్యుబుల్ అడెనీలిల్ సైక్లాస్(sAC) అనే ఎంజైమ్ ను ఈ డ్రగ్ తాత్కాలికంగా కట్టడి చేయడం ద్వారా వీర్యం అండాన్ని చేరుకోదు. ఇవి మహిళల బర్త్ కంట్రోల్ పిల్స్ కన్నా ప్రభావితమైనవి. సెక్స్ కు గంట ముందు మగవారు వీటిని వేసుకుంటే 24 గంటల పాటు ప్రభావం చూపిస్తుంది” అని శాస్త్రవేత్తలు తెలిపారు.