Adesh Gupta Quits: ఢిల్లీలో బీజేపీకి భారీ షాక్, ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షుడి రాజీనామా, తదుపరి అధ్యక్షుడిపై కొనసాగుతున్న కసరత్తు
తదుపరి నోటీసు వచ్చే వరకు ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’’ అని తెలిపారు.
New Delhi, DEC 11: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో (MCD Elections) ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ భారతీయ జనతా పార్టీ చీఫ్ ఆదేశ్ గుప్తా (Adesh Gupta Quits) ఆదివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. అయితే తదుపరి అధ్యక్షుడిని నియమించేంత వరకు ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‌దేవాను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించనున్నట్లు సమాచారం. ఈ విషయమై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ (Arun singh) మాట్లాడుతూ “బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలను అనుసరించి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా రాజీనామాను మేము ఆమోదించాము. తదుపరి నోటీసు వచ్చే వరకు ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’’ అని తెలిపారు.
ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. వాస్తవానికి ఢిల్లీ మున్సిపాలిటీని ఆప్ 15 ఏళ్లుగా పాలిస్తోంది. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో పోటీకి దిగింది. గత ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు గెలిచింది.
అలాంటి ఈసారి కేవలం 100 మార్క్ దగ్గరే ఆగిపోవడం పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఇక శనివారం బీజేపీపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దాడి ప్రారంభించారు. బీజేపీ అనేక యంత్రాంగాన్ని మోహరించి, ఎన్నికలను కఠినతరం చేసినప్పటికీ ఆప్‌ను అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమనే ఎన్నుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.