University Of Buckingham: హైదరాబాద్‌ యువతితో అక్రమ సంబంధం, యూకే యూనివర్సిటీ వీసీ సస్పెండ్...పూర్తి వివరాలివే

అంతేగాదు విచారణలో యూనివర్శిటీ ఫీజు చెల్లించడంలో అతడు ఆమెకు సహాయం చేసినట్లు సమాచారం. 65 ఏళ్ల ప్రొఫెసర్ టూలీతో తనకు లైంగిక సంబంధం ఉందని భారతీయ మహిళ తన డైరీలో పేర్కొంది. యువతి రాసిన డైరీల కాపీలను ప్రొఫెసర్ భార్య యూనివర్సిటీకి అందజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Affair with Hyderabad woman, UK university vice-chancellor suspended(X)

Delhi, Dec 6: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో అక్రమసంబంధం ఉందన్న ఆరోపణలతో బకింగ్‌హామ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేమ్స్ టూలీపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేగాదు విచారణలో యూనివర్శిటీ ఫీజు చెల్లించడంలో అతడు ఆమెకు సహాయం చేసినట్లు సమాచారం. 65 ఏళ్ల ప్రొఫెసర్ టూలీతో తనకు లైంగిక సంబంధం ఉందని భారతీయ మహిళ తన డైరీలో పేర్కొంది. యువతి రాసిన డైరీల కాపీలను ప్రొఫెసర్ భార్య యూనివర్సిటీకి అందజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ వార్తలను టూలీ ఖండించారు. తన న్యాయవాది ద్వారా ప్రకటన విడుదల చేసిన టూలీ...ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అన్నారు.

ఫిబ్రవరి 2022లో టూలీని వివాహం చేసుకున్నారు సింథియా. ఇటీవలె వీరిద్దరూ విడిపోగా ఆ తర్వాత ఈ ఆరోపణలను యూనివర్సిటీ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రొఫెసర్ టూలీ 2020 నుంచి వైస్-ఛాన్సలర్‌గా పనిచేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. హైదరాబాద్ యువతి 18 ఏళ్ల వయసులో యూకే యూనివర్సిటీ వీసీని మొదటిసారి కలిశారని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంబంధం శరీరిక సంబంధంగా మారిందని డైరీలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో యూనివర్సిటీ నుండి టూలీని సస్పెండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.   ఫ్రాన్స్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాని పదవి కొల్పోయిన మిచెల్ బార్నియర్..60 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి 

ఆరోపణల నేపథ్యంలో విశ్వవిద్యాలయ నిర్వాహకులు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డేవిడ్ కోల్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ క్రిస్ పేన్ ప్రో వైస్-ఛాన్సలర్ హ్యారియెట్ డన్‌బార్-మోరిస్‌లను తాత్కాలిక సహ-హెడ్‌లుగా నియమించారు.