Airtel Wi-Fi Calling: అదనపు ఛార్జీలు అవసరం లేదు, ఎక్కడి నుంచైనా వైఫై కాలింగ్ సర్వీస్, తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్, సపోర్ట్ చేసే ఫోన్ల లిస్ట్ ఓ సారి తెలుసుకోండి

తెలుగు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లకు ఎయిర్‌టెల్ (Bharti Airtel) మరో సదుపాయాన్నిఅందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యం వైఫై కాలింగ్ సర్వీసును (Airtel Wi-Fi Calling) యూజర్ల కోసం తీసుకువచ్చింది. దీని ద్వారా మరింత మెరుగైన వాయిస్ కాలింగ్ (Voice Calling)అనుభూతి కలుగుతుందని, ఏ నెట్ వర్క్‌లోని కస్టమర్లకైనా వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని కంపెనీ పేర్కొంది.

Airtel Wi-Fi Calling (Photo-AIrtel Website)

New Delhi,December 23: తెలుగు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లకు ఎయిర్‌టెల్ (Bharti Airtel) మరో సదుపాయాన్నిఅందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యం వైఫై కాలింగ్ సర్వీసును (Airtel Wi-Fi Calling) యూజర్ల కోసం తీసుకువచ్చింది. దీని ద్వారా మరింత మెరుగైన వాయిస్ కాలింగ్ (Voice Calling)అనుభూతి కలుగుతుందని, ఏ నెట్ వర్క్‌లోని కస్టమర్లకైనా వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని కంపెనీ పేర్కొంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ తెలుగు రాష్ట్రాల సీఈఓ అన్వీస్ సింగ్ పూరీ పేర్కొన్నారు.

ఈ సదుపాయం పొందేందుకు ఎటువంటి యాప్ అవసరం లేదని, వైఫై కాలింగ్ కు మద్దతిచ్చేలా తాజా వర్షన్‌కు ఫోన్ సిస్టమ్‌ను అప్ గ్రేడ్ చేసుకుంటే చాలని అన్వీస్ సింగ్ వెల్లడించారు. ఆపై మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లో వైఫై కాలింగ్ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐఫోన్ 6ఎస్ ఆపై వెలువడిన అన్ని ఆపిల్ ఫోన్లతో పాటు, శాంసంగ్ జే6, ఏ 10, ఒన్ 10, ఎస్ 10 ప్లస్, ఎస్ 10ఈ, వన్ ప్లస్ 6, 7 సీరీస్ ఫోన్లు, రెడ్ మీ కే 20, కే 20 ప్రో తదితర ఫోన్లన్నీ సపోర్ట్ చేస్తాయని తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement