Alaska Airlines Incident: అన్ని బోయింగ్ 737–8 మాక్స్ విమానాల డోర్లు వెంటనే తనిఖీ చేయండి, విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ

ఈ ఘటన నేపథ్యంలో తమ ఫ్లీట్‌లోని బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాల అత్యవసర నిష్క్రమణ ద్వారాల డోర్లు తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ విమానయాన సంస్థలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ శనివారం ఆదేశించింది.

DGCA

అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని డోర్ ఊడిపడిపోయిన సంగతి విదితమే. దాంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సుక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో తమ ఫ్లీట్‌లోని బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాల అత్యవసర నిష్క్రమణ ద్వారాల డోర్లు తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ విమానయాన సంస్థలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ శనివారం ఆదేశించింది. బోయింగ్ 737 -9 మాక్స్ విమానానికి సంబంధించిన అలస్కా ఎయిర్‌లైన్స్ ఘటన నేపథ్యంలో ఈ ఆదేశం వచ్చింది.తాజా ఆదేశం ముందుజాగ్రత్త చర్య అని సీనియర్ DGCA అధికారి తెలిపారు.

సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లతో సహా హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ దుర్మరణం

ప్రస్తుతం తమ ఫ్లీట్‌లో భాగంగా నడుస్తున్న అన్ని బోయింగ్ 737-8 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో అత్యవసర నిష్క్రమణలను ఒక సారి తనిఖీ చేయాలని DGCA అన్ని భారతీయ ఎయిర్ ఆపరేటర్లను ఆదేశించింది" అని అధికారి తెలిపారు. బోయింగ్ 737 -9 మాక్స్ విమానానికి సంబంధించిన అలస్కా ఎయిర్‌లైన్స్ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు బోయింగ్ నుండి ఎలాంటి ఇన్‌పుట్‌లు లేదా మార్గదర్శకత్వం రాలేదని అధికారి తెలిపారు.

Here's Video

ఈ వన్-టైమ్ తనిఖీలు విమానం రాత్రి ఆగిపోయే సమయంలో జరుగుతాయి" అని అధికారి తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్ మరియు అకాసా ఎయిర్ తమ విమానాల్లో బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాలను కలిగి ఉన్నాయి.

అల‌స్కా ఎయిర్‌లైన్స్‌(Alaska Airlines)కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్ష‌ణాల‌కు ఆ విమానం డోరు స‌డెన్‌గా తెరుచుకున్న‌ది. దీంతో ఆ విమానాన్ని అత్య‌వ‌స‌రంగా దించేశారు. విమానం నుంచి ఎగ్జిట్ డోరు వేరైన‌ట్లు తెలుస్తోంది. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ నుంచి ఏఎస్‌1282 విమానం టేకాఫ్ తీసుకున్న‌ది. టేకాఫ్ త‌ర్వాత విమానం డోరు ఊడిపోవ‌డంతో దాన్ని వెంట‌నే దీంచేశారు. పోర్ట్‌ల్యాండ్ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలోనే ఆ విమానం ల్యాండ్ అయ్యింది. ఆ స‌మ‌యంలో విమానంలో 171 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్(Alaska Airlines) కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్‌ 737-9 విమానాల సేవల్ని నిలిపివేసింది. దీంతో సంస్థలోని ఈ మోడల్‌కు చెందిన 65 విమానాలు(Boeing 737-9 Fleet) ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఈ మేరకు అలస్కా ఎయిర్‌లైన్స్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

‘బోయింగ్ విమానం (Flight 1282)లో చోటుచేసుకున్న ఘటనతో మేం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాం. వాటిలో భాగంగా బోయింగ్‌ 737-9కు చెందిన 65 విమానాల సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశాం’ అని ఎయిర్‌లైన్స్ సీఈఓ వెల్లడించారు.ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందు విమానంలో పీడన సంబంధిత సమస్య తలెత్తిందని సిబ్బంది వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరుపుతామని ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌(FAA) వెల్లడించింది.

ఈ విమానాన్ని అక్టోబర్‌లో అలస్కా సంస్థకు డెలివరీ చేశారు. నవంబర్‌లో ధ్రువీకరణ లభించిందని ఎఫ్‌ఏఏ డేటాతో తెలుస్తోంది. ఈ ఘటనపై బోయింగ్ సంస్థ కూడా స్పందించింది. ‘దీనిపై మేం మరింత సమాచారాన్ని సేకరిస్తున్నాం. మా కస్టమర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. మా సాంకేతిక బృందం విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉంది’ అని తెలిపింది.