Andhra Pradesh Shocker: విశాఖలో లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు, ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట రాక్షసుడిగా స్నేహితులకు..

న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.

Rape Image (photo-Rep)

Vizag, Nov 19: విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన సహచర విద్యార్థి అయిన వంశీతో ఆమె స్నేహం చేసింది. తాను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన వంశీ... గత ఆగస్ట్ 10న కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే నెల 13న డాబా గార్డెన్స్ లోని తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.

వీడియో ఇదిగో, ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళపై విరుచుకుపడిన కామాంధుడు, పాడుబడిన పెట్రోల్ బంక్ కు లాక్కెళ్ళి..

రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేశ్, జగదీశ్ బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని, లేకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె వంశీ దృష్టికి తీసుకెళ్లింది. వంశీ కూడా వారి కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. రోజురోజుకూ ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో నిన్న ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఇది గమనించిన బాధితురాలి తండ్రి ఆమెను అడ్డుకుని... ఏం జరిగిందని నిలదీశారు. దీంతో, అసలు విషయం బయటపడింది. ఆయన వెంటనే విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురినీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif