Astrology: నవంబర్ 11 తర్వాత బుధ సంచారం, కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
ముఖ్యంగా తెలివితేటలు ఆర్థిక లాభం భాగస్వామ్యంలో లాభాలు ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు.
జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధుడికి ప్రసంగం ఆలోచన బాధ్యత వహించే గ్రహంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా తెలివితేటలు ఆర్థిక లాభం భాగస్వామ్యంలో లాభాలు ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. అయితే నవంబర్ 11వ తేదీన 6 గంటలకు బుధుడు జ్యేష్ఠ నక్షత్రంలోనికి సంచరిస్తాడు. బుధుడు జేష్ట నక్షత్రంలోనికి సంచరించడం కారణంగా 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సింహరాశి- సింహ రాశి వారికి జ్యేష్ఠ నక్షత్రంలోనికి బుధుడు సంచారం కారణంగా వీరికి అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు వారి కెరియర్లో అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే గల నెరవేరుతుంది. అంతేకాకుండా వీరు వ్యాపార విస్తరణ కూడా కార్యరూపం దాలుస్తుంది. అపారమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. రాబోయే కాలంలో వీరికి అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా లాభాలను ఇస్తాయి. అమ్మకాలు పెరుగుతాయి. దీని ఫలితంగా వీరు ఆర్థికంగా ఎటువంటి నష్టాలు ఉండవు. చదువుకున్న విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
Vastu Tips: ప్రభుత్వ ఉద్యోగాల కావాలా.
కన్యా రాశి- కన్య రాశి వారికి బుధుడి నక్షత్రం మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉన్నాయి. వీరికి ఆ బుధ గ్రహం ప్రత్యేక ఆశీర్వాదాలు జీవితం ఆనందమయంగా ఉంటుంది. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. కోర్టు కేసుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు ఇల్లు కొనాలనుకునే కళ వచ్చే నెలలో నెరవేరుతుంది. మీ ఇంట్లో పెద్దలకు అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న కడుపు నొప్పి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. దీని వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి బుధుని సంచారం కారణంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో కొనసాగుతున్న గొడవలు అన్నీ కూడా తగ్గిపోతాయి. వీరి పని చేసే చోట లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు వారు చేసే పని అన్నీ కూడా వేగవంతంగా పూర్తి అవుతాయి. ఇది లాభాలను పెంచుతుంది. వ్యాపారవేత్తలు తీసుకునే ఒక నిర్ణయము మీకు లాభాల బాటలను తీసుకొస్తుంది. భవిష్యత్తులో భారీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యపరంగా కూడా రాబోయే కాలంలో అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.