ATM Charges: ఏటీఎంకు వెళ్తే ఇక బాదుడే, జనవరి నుంచి పెరుగనున్న ఏటీఎం చార్జీలు, పరిమితి మించితే భారీ చార్జీ
వచ్చే నెల నుంచి ఏటీఎమ్ ఛార్జీలు(ATM Charges) పెరిగే అవకాశముంది. పరిమితికి మించి చేసే లావాదేవీ(Transactions)లపై విధించే ఛార్జీలను జనవరి నుంచి పెంచాలని భావిస్తున్నాయి పలు బ్యాంకులు(Banks).
Mumbai December 02: ఖాతాదారులకు(Costumers) షాక్ ఇచ్చే న్యూస్ చెప్పాయి బ్యాంకులు(Banks). వచ్చే నెల నుంచి ఏటీఎమ్ ఛార్జీలు(ATM Charges) పెరిగే అవకాశముంది. పరిమితికి మించి చేసే లావాదేవీ(Transactions)లపై విధించే ఛార్జీలను జనవరి నుంచి పెంచాలని భావిస్తున్నాయి పలు బ్యాంకులు(Banks).
ఏటీఎమ్(ATM)ల వద్ద నెలవారిగా బ్యాంకులు అందిస్తున్న ఉచిత పరిమితికి మించి చేసే నగదు(CASH), నగదురహిత లావాదేవీలకు విధించే ఛార్జీలను జనవరి(January), 2022 నుంచి పెంచేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది జూన్(June)లో అనుమతిచ్చింది.
ఆర్‌బీఐ(RBI) మార్గదర్శకాలను అనుసరించి.. యాక్సిస్ బ్యాంక్(Axis Bank) లేదా ఇతర బ్యాంకు ఏటీఎమ్(ATM)ల వద్ద ఉచిత పరిమితిని దాటి లావాదేవీలు నిర్వహిస్తే జనవరి 1, 2022 నుంచి లావాదేవీ రుసుము(Charge) రూ. 21+జీఎస్‌టీ వర్తిస్తుందని యాక్సిస్ బ్యాంక్(Axis Bank) తెలిపింది.
నెలవారి పరిమితికి మించి ఏటీఎమ్ వద్ద చేసే ప్రతీ లావాదేవీకి ప్రస్తుతం రూ.20 చార్జ్ చేస్తున్నారు. అధిక ఇంటర్‌చేంజ్(Interchange) ఫీజు భర్తీ చేసేందుకు, అలాగే సాధారణ ఖర్చులు పెరగడంతో కస్టమర్ ఛార్జీలను పెంచేందుకు బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎమ్‌ల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంక్ ఏటీఎమ్‌లలో మెట్రో నగరాలలో మూడు, నాన్-మెట్రో నగరాలలో ఐదు ఉచిత లావాదేవీలు చేయవచ్చు.
ఇది కాకుండా, ఆర్థిక లావాదేవీల కోసం ప్రతి లావాదేవీకి ఇంటర్‌చేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ. 17కి, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 5 నుంచి రూ. 6 వరకు పెంచేందుకు కూడా సెంట్రల్ బ్యాంక్ అనుమతించింది. ఇది ఆగష్టు 1, 2021 నుంచి అమలులోకి వచ్చింది.