IND vs AUS 4Th test: 333 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా... చివరి వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డ టీమిండియా బౌలర్లు..5వ రోజు అద్భుతం జరిగేనా!
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ కాగా
Delhi, December 29: మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ కాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు తొలుత భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
ఓ దశలో 156 పరుగులకే 8 వికెట్లు కొల్పోగా ఆసీస్ ఆలౌట్ కావడం తధ్యమని భావించారు అంతా. అయితే అనూహ్యంగా కమిన్స్, నాథన్ లైయన్ రాణించడంతో ఆసీస్ భారీ ఆధిక్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఇక చివరి వికెట్ కోసం భారత బౌలర్లు 19 ఓవర్లు వేసిన ఫలితం లేకపోయింది. సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్ రెడ్డి తెలుసా?
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా బొలాండ్ 10,లైయన్ 41 క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు,సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Australia reach 228/9 and lead by 333 runs