IPL Auction 2025 Live

Reliance Home Finance: అప్పుల ఊబిలో అనిల్ అంబాని, రూ. 2,900 కోట్లకు రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ అమ్మకం, అతి పెద్ద బిడ్డర్‌గా అవతరించిన ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కొంత మేర తీరనున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కష్టాలు

రూ. 2,900 కోట్ల ఆఫర్‌తో ఈ బిడ్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆథమ్‌ నుంచి ముందస్తు చెలింపుగా 90 శాతం నిధులు లభించనుండగా.. మరో రూ. 300 కోట్లు ఏడాదిలోగా బీవోబీ పొందనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి.

Anil Ambani. (Photo Credits: File Image)

Mumbai, June 21: అప్పుల భారంతో కుదేలైన అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కొనుగోలుకి ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (Authum Investment and Infrastructure) అతి పెద్ద బిడ్డర్‌గా నిలిచింది. రూ. 2,900 కోట్ల ఆఫర్‌తో ఈ బిడ్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆథమ్‌ నుంచి ముందస్తు చెలింపుగా 90 శాతం నిధులు లభించనుండగా.. మరో రూ. 300 కోట్లు ఏడాదిలోగా బీవోబీ పొందనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి.

బిడ్డింగ్‌కు వారాంతాన గడువు ముగిసింది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయితే రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌కు (Reliance Home Finance) రుణాలిచ్చిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) రూ. 2,587 కోట్లు అందుకునే వీలున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కోసం ఎఐఐఎల్ రూ .2,887 కోట్లు ఇచ్చిందని జూన్ 20 న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

దేశీయ ఎన్‌బీఎఫ్‌సీ ఆథమ్‌ రేసులో తొలి ర్యాంకులో నిలిచినట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆథమ్‌ 2021 డిసెంబర్ 31 నాటికి నెట్‌వర్త్‌ రూ. 1,500 కోట్లుగా నమోదైంది. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా ఆథమ్‌ వేసిన బిడ్‌ అత్యధిక నికర ప్రస్తుత విలువ(ఎన్‌పీవీ)ను కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అత్యధిక శాతం రుణదాతలు ఆథమ్‌కు ఓటు వేసినట్లు వెల్లడించాయి. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కొనుగోలుకి ఆథమ్‌ కాకుండా.. ఏఆర్‌ఈఎస్‌ ఎస్‌ఎస్‌జీ, అసెట్స్‌కేర్‌– రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజ్, ఏఆర్‌సీఎల్‌తో కలసి ఎవెన్యూ క్యాపిటల్, క్యాప్రి గ్లోబల్‌ క్యాపిటల్‌ బిడ్‌ వేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మీ CIBIL స్కోరు నిమిషంలో తెలుసుకోవచ్చు, పేటీఎం నుంచి కొత్త ఫీచర్, క్రెడిట్‌స్కోర్‌ను పేటియం నుంచి తెలుసుకోవడం ఎలాగో పూర్తి సమాచారం మీకోసం

"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రుడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్) పరంగా తీర్మానం ప్రక్రియలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ('ఆర్‌హెచ్‌ఎఫ్ఎల్') యొక్క అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి సంబంధించి మా కంపెనీ 19.06.2021 న విజయవంతమైన అత్యధిక బిడ్డర్‌గా అవతరించిందని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఒత్తిడితో కూడిన ఆస్తుల తీర్మానం కోసం) 2019 జూన్ 7 నాటి 2019 ('ఆర్‌బిఐ దిశలు'), "రెగ్యులేటరీ ఫైలింగ్‌లో AIIL తెలిపింది.