Justice BV Nagarathna: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రేసులో మహిళ, జస్టిస్ బీవీ నాగరత్న పేరును సిఫార్సు చేసిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం, ప్రధాన న్యాయమూర్తి రేసులో తొమ్మిది మంది, వీరిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు

పరిస్థితులు సహకరిస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఓ మహిళ చేపట్టనున్నారు.కర్ణాటకకు చెందిన జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagarathna) 2027 లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోయే మొదటి మహిళగా నిలవనున్నారు.

Supreme Court of India | (Photo Credits: IANS)

New Delhi, August 18: అన్నీ అనుకున్నట్లు జరిగితే భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవిని ఒక మహిళ (first woman chief justice) చేపేట్టే సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే గతంలో అన్న మాటలు అక్షరాల నిజమయ్యేందుకు దారులు ఏర్పడుతున్నాయి. పరిస్థితులు సహకరిస్తే   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఓ మహిళ చేపట్టనున్నారు.కర్ణాటకకు చెందిన జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagarathna) 2027 లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోయే మొదటి మహిళగా నిలవనున్నారు.

ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (Justice NV Ramana) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తదుపరి చీఫ్‌ జస్టిస్‌ రేసులో ఉన్న 9 మంది న్యాయమూర్తుల (Supreme Court Collegium Recommends 9 Names) పేర్లు సిఫార్సు చేసింది. వీరిలో బీవీ నాగరత్న పేరు కూడా ఉన్నది. నాగ‌రత్న‌తో పాటు మ‌హిళా జ‌డ్జిల్లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీ, గుజరాత్ నుంచి జ‌స్టిస్ బేలా త్రివేదిలు ఉన్నారు. కాగా భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానానికి మ‌హిళా చీఫ్ జ‌స్టిస్ కావాల‌న్న డిమాండ్లు ఇటీవ‌ల వెల్లువెత్తాయి. మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే త‌న రిటైర్మెంట్‌కు ముందు ఈ అభిప్రాయాన్ని వినిపించారు.

జ‌స్టిస్ నాగ‌ర‌త్న క‌ర్నాట‌క హైకోర్టులో 2008లో అద‌న‌పు జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌గా ప‌దోన్న‌తి పొందిన‌వారిలో మాజీ అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ పీఎస్ న‌ర్సింహా ఉన్నారు. కొలీజియం ప్రతిపాదించిన జాబితాలో జ‌స్టిస్ అభ‌య్ శ్రీనివాస్ ఓకా, జ‌స్టిస్ విక్ర‌మ్ నాథ్‌, జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి, జ‌స్టిస్ సీటీ ర‌వికుమార్‌, జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్‌లు ఉన్నారు.సుప్రీంకోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది పీఎస్ నరసింహ పేరు కూడా కొలీజయం జాబితాలో ఉంది.

పెగాస‌స్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు, ప‌దిరోజుల్లో దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశాలు, వీటిపై బ‌హిరంగంగా చ‌ర్చించ‌లేమ‌ని కోర్టుకు నివేదించిన తుషార్ మెహ‌తా

ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీవీ నాగరత్నం పేరును కొలీజియం సిఫార్సు చేసింది. బీవీ నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తే.. అది దేశ న్యాయ చరిత్రలో చారిత్రాత్మక క్షణంగా నిలుస్తుంది. నాగరత్న తండ్రి ఈఎస్‌ వెంకటరామయ్య (E S Venkataramiah) గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జూన్ 1989 నుంచి డిసెంబర్ 1989 మధ్య భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. కాగా నాగరత్న, పీఎస్ నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.

Here's ANI Tweet

భారతదేశంలో 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. అంతకుముందు 1935 నుంచి ఉన్న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీం కోర్టు వచ్చింది. అప్పటినుంచి 47మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. తొలిగా ఎపెక్స్ కోర్టులో 8 మంది జడ్జిలు మాత్రమే ఉండేవారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారాన్ని రాజ్యాంగం, పార్లమెంటుకు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 మంది. అయితే, ఇప్పటివరకూ కేవలం 8 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో జడ్జ్‌లుగా వ్యవహరించారు.

చర్చలేకుండా ఎలా ఆమోందించారు, ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు ఆర్డినెన్స్ కొట్టివేసినా బిల్లులోకి ఎలా చేర్చారని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టాలని ఆదేశం

1989లో తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం 34 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో కేవలం ఒక్క కోర్టులో మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆమె, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ. దేశవ్యాప్తంగా ఉన్న 661 మంది హైకోర్టు జడ్జ్‌లలో కేవలం 73 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మణిపూర్, మేఘాలయ, పట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్‌లలో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు.

HERE ARE THE NAMES OF 9 JUDGES:

1) Justice Hima Kohli: Chief Justice of Telangana

2) Justice BV Nagarathna: Judge of Karnataka High Court -- likely to become India's first Woman CJI if her name is cleared immediately

3) Justice Bela Trivedi: Judge of Gujarat High Court

4) Senior Advocate PS Narasimha: Direct elevation from the Bar -- 9th such elevation directly from the Bar

5) Justice Abhay Shreeniwas Oka: Chief Justice of Karnataka High Court

6) Justice Vikram Nath: Chief Justice of Gujarat High Court

7) Justice Jitendra Kumar Maheshwari: Chief Justice of Sikkim High Court

8) Justice CT Ravikumar: Judge of Kerala High Court

9) Justice MM Sundresh: Judge of Madaras High Court