Bengaluru: ఉద్యోగాల పేరుతో మైనర్ బాలికలతో వ్యభిచారం, 12 మంది మైనర్ బాలికలను రక్షించిన పోలీసులు, జువైనల్ హోంకు తరలింపు
ఉద్యోగాల పేరుతో 12 మంది మైనర్ బాలికలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో సహా త్రిపుర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర మరియు కర్ణాటకతో సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి మైనర్ బాలికలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు.
Bengaluru, Oct 23: కర్ణాటక రాజధాని బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో 12 మంది మైనర్ బాలికలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో సహా త్రిపుర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర మరియు కర్ణాటకతో సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి మైనర్ బాలికలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు.
బెంగుళూరుకు చెందిన ఎన్జీవోల సహాయంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ మహిళా రక్షణ విభాగం పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించి మైనర్ బాలికలను సేవ్ చేశారు. ఉద్యోగాల సాకుతో బాలికలను బెంగుళూరుకు రప్పించారని వారి తల్లిదండ్రులే విక్రయించారని పోలీసులు తెలిపారు.
బాలికల వయస్సు 14 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల వారని.... ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేంద్రాలలో కౌన్సెలింగ్ మరియు పునరావాసం కల్పిస్తామని పోలీసులు తెలిపారు. మైనర్లను త్వరలోనే వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని... బంగ్లాదేశ్‌కు చెందిన వారిని చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెనక్కి పంపిస్తామని వెల్లడించారు. షాకింగ్ వీడియో ఇదిగో, మెడలో చైన్ రాకపోవడంతో మహిళను అలాగే ఈడ్చుకెళ్లిన దొంగలు, తమిళనాడులోని మధురైలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
ముగ్గురు కస్టమర్లతో 26 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసు కమిషనర్ బి.దయానంద మంగళవారం తెలిపారు. వారందరినీ అరెస్టు చేసి, వివిధ సెక్షన్లతో పాటు మానవ అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.