Bengaluru: విమానంలో మహిళపై తోటి ప్రయాణికుడు దారుణం, నిద్రపోతుండగా ప్రైవేట్ భాగాల్లో చేతులు పెట్టి అసభ్య ప్రవర్తన, నిందితుడిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌ నగరం నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఏపీకి చెందిన మహిళ (32) తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులకు గురయింది. తిరుపతికి చెందిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు

Airplane Representational Image (Photo Credits: Pixabay)

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌ నగరం నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఏపీకి చెందిన మహిళ (32) తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులకు గురయింది. తిరుపతికి చెందిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఫ్రాంక్‌ఫర్ట్‌- బెంగళూరు లుఫ్తాన్సా విమానంలో నవంబర్‌ 6న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.

మహిళ విమానంలో నిద్రపోతుండగా ఆమె పక్కనే కూర్చున్న తోటి ప్రయాణికుడు ఆమె ప్రైవేటు భాగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ప్రయాణ సమయంలోనూ ఆమెపై లైంగిక వేధింపులు కొనసాగించడంతో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి చెప్పి సదరు మహిళ తన సీటును మార్చుకున్నారు. అనంతరం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అక్కడి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

కర్ణాటకలో దారుణం, భార్యపై అనుమానంతో చున్నీ బిగించి హత్య చేసిన భర్త, అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

తాను నిద్రపోతున్న సమయంలో నిందితుడు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 354 ఎ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని.. ఆ తర్వాత అతడు బెయిల్‌పై విడుదలయ్యాడని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement