Bihar Shocker: చెల్లిని ప్రేమించాడని మర్మాంగాన్నే కోసేశారు, తీవ్ర రక్త స్రావం కావడంతో బాధితుడు మృతి, ఆగ్రహంతో లవర్ ఇంటి ముందే అంత్యక్రియలు నిర్వహించిన మృతుడి బంధువులు, బీహార్ ముజఫర్‌ఫూర్ జిల్లాలో దారుణ ఘటన
తమ గ్రామంలోని యువతిని ప్రేమించాడనే కోపంతో.. యువకుని పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. అతని ప్రైవేట్ భాగాన్ని (cutting off the private part ) కోసేశారు.
Bihar Shocker:బీహర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామంలోని యువతిని ప్రేమించాడనే కోపంతో.. యువకుని పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. అతని ప్రైవేట్ భాగాన్ని (cutting off the private part ) కోసేశారు. ముజఫర్‌ఫూర్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో రేవురా రాంపుర్ గ్రామానికి చెందిన సౌరభ్ కుమార్ అనే యువకుడు, తమ పక్క గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో సౌరభ్ ప్రతిరోజు సోర్బారా గ్రామానికి వెళ్లి ప్రియురాలిని కలుస్తుండేవాడు.
కొద్ది రోజులుగా యువతి ప్రవర్తన పట్ల ఆమె సోదరులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. గత శుక్రవారం కూడా ఎప్పటిలాగే ఆ ప్రేమికులిద్దరు ఇంట్లో వాళ్లకు తెలియకుండా కలుసుకున్నారు. ఆ రోజున వీరిద్దరు ఒక చోట ఉన్నప్పుడు యువతి సోదరులు పట్టుకున్నారు. సౌరభ్‌ను కోపంతో దూరంగా లాక్కొనిపోయారు. ఇనుపకడ్డీలతో, రాడ్‌లతో విచక్షణ రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. అతని మర్మాంగాన్నికత్తితో కోసేశారు. దీంతో ఆ యువకుడు, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాగా, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, బాధితుడి బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
సౌరభ్‌ను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో సౌరభ్ ఆసుపత్రిలో చికిత్సపోందుతూ మృతి (The girl’s family killed her lover) చెందాడు. అతని శరీరంపై కత్తిగాయాలు ఉన్నాయని, దెబ్బలకు తాళలేక చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో కోపంతో రగిలిపోయిన యువకుడి బంధువులు, యువతి ఇంటిముందే సౌరభ్ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు (angry relatives performed the last rites outside the house) నిర్వహించారు.
అంత్యక్రియల వీడియో
కాగా, మృతుడి బంధువులు, యువతి సోదరులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు అశోక్ ఠాకుర్, రంజిత్ కుమార్, ముకేష్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న మరికొంత మందిని పట్టుకుంటామని ముజఫర్‌పూర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత తలెత్తడంతో, గస్తీని పెంచామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని డీఎస్పీ రాజేష్ కుమార్ పేర్కొన్నారు.
ముజఫర్‌పూర్ (నగర) పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, “ టీనేజర్‌ను ప్రేమ వ్యవహారంలో హత్య చేసినట్లు తెలుస్తుంది. అతను కొట్టబడ్డాడు మరియు అతని ప్రైవేట్ భాగాలు కత్తిరించబడ్డాయి. " ఈ కేసులో ప్రధాన నిందితుడు సుశాంత్ పాండేతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
యువతి తండ్రి సుశాంత్ పాండే, అతని కుమారుడు నన్ను, నా కుటుంబాన్ని బెదిరించారని బాలుడి తండ్రి ANI కి చెప్పారు. “అమ్మాయి, అబ్బాయి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. అమ్మాయి కుటుంబం వివాహానికి అంగీకరించనప్పుడు, మేము మా అబ్బాయిని పని కోసం వేరే నగరానికి పంపించాము. ఈ సంఘటన జరిగినప్పుడు, అతను తన సోదరితో ఉన్నాడు. ఆమో ఓ వివాహం కోసం పట్టణానికి వచ్చిందని తెలిపాడు.