Kurnool One Town police Arrested two teenagers (Photo-Twitter/Kurnool Police)

Kurnool, Jul 25: కాల్‌గర్ల్స్, అశ్లీల మహిళల వీడియో కాల్స్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు (Kurnool One Town police) శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను సీఐ కళా వెంకటరమణ మీడియాకు వివరించారు.వారి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు మండలం మిలటరీ కాలనీకి చెందిన తెలుగు జనార్ధన్, అలాగే శ్రీరామనగర్‌కు చెందిన బెస్త ప్రవీణ్‌కుమార్‌ కొంతకాలంగా ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కాల్‌గర్ల్స్‌ను సరఫరా చేస్తామని, అశ్లీల వీడియో కాల్స్‌ (video calls of pornographic women) చేయిస్తామంటూ..దీనికి రూ. 300 నుంచి రూ. 5,000 వరకు ఖర్చు అవుతుందని ఔత్సాహికులకు ఎర వేస్తారు.

ఇలా ఒకేసారి వాట్సప్‌లో కొన్ని రకాల యాప్స్‌ను ఉపయోగించి 100 నుంచి 1000 మంది వరకు బల్క్‌ మెసేజ్‌లు పంపుతారు. ఈ మెసేజ్ లు చూసి ఎవరైనా ఆకర్షితులైతే వారిని మభ్యపెట్టి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పటికే ఎంతోమంది వీరికి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసి మోసపోయినట్లు ఇటీవల కాలంలో బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దృష్టి సారించిన వన్‌టౌన్‌ సీఐ దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదేం విచిత్రం, పెళ్లి కోసం హిజ్రాగా మారిన యువతి, తర్వాత పెళ్లికి నిరాకరించిన మరో యువతి, మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడప పోలీసులు

Here's Kurnool Police Tweet

సాంకేతిక పరిజ్ఞానంతో జొహరాపురం సబ్‌ స్టేషన్‌ వద్ద నిందితుడు తెలుగు జనార్ధన్‌ ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. మరో నిందితుడి వివరాలు చెప్పడంతో మాంటిస్సోరి స్కూల్‌ వద్ద ప్రవీణ్‌కుమార్‌తో పాటు నిందితులు వాడిన సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి బ్యాంక్‌ అకౌంట్లను ఇప్పటికే గుర్తించామన్నారు. రోజూ రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. యువత ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.