New Delhi, April 09: తీవ్రమైన ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు, నకిలీ ఉద్యోగ పోస్టింగ్‌ల బారిన పడటం చాలా సులభం. కంపెనీల్లో నిరంతర తొలగింపుల కారణంగా ఈ రోజుల్లో వేలాది మంది ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. అయితే, ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, జాబ్ లిస్టింగ్‌లో పాల్గొనే ముందు జాగ్రత్తగా ఉండడం. లేదంటే, కొండ నాలుకకు మందేసే క్రమంలో ఉన్న నాలుకను కోల్పోయిన చందంగా తయారువుతుంది. ఢిల్లీకి (New Delhi) చెందిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ఆ యువతి 8.6 లక్షల రూపాయలకు పైగా కోల్పోయింది. సదరు మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ ప్రకటనపై (applying for a job) క్లిక్ చేసింది. అంతే ఆమె బ్యాంకు నుంచి 8.6 లక్షల రూపాయలకు పైగా సైబర్ కేటుగాళ్లకు చిక్కినట్లు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు. అప్పుడెప్పుడో డిసెంబరులో చేసిన ఈ ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అతని భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ ప్రకటన (job advertisement on Instagram) చూసి లింక్‌ను తెరిచాక ఆమె ‘ఎయిర్‌లైన్ జాబ్ ఆలిండియా’ అని పిలువబడే మరో ఐడీకి మళ్లించబడిందట. వారు అడిగిన వివరాలను ఫార్మాట్‌లో నింపింది. ఆ తర్వాత రాహుల్ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ముందుగా 750 రూపాయలు ‘రిజిస్ట్రేషన్ ఫీజు’గా డిపాజిట్ చేయాలని మోసగాడు కోరాడు. దీని తరువాత, అతను తన ఖాతాకు 8.6 లక్షల రూపాయలకు పైగా ‘గేట్ పాస్ ఫీజు, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డబ్బు’గా బదిలీ చేయమని కోరగా, ఆమె పంపింది. అయితే అతడు మరింత డబ్బు అడగడంతో ఏదో తప్పు జరిగిందని ఆ మహిళ గ్రహించి పోలీసులకు సమాచారం అందించింది. కానీ అప్పటికే ఆమె మళ్లీ తిరిగి పొందలేకుండా డబ్బు కోల్పోయింది. ఢిల్లీ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
అనంతరం డీసీపీ సంజయ్ సైన్‌ను స్పందిస్తూ “హర్యానాలోని హిసార్ నుంసీ ఎక్కువ డబ్బు ఉపసంహరించుకున్నట్లు దర్యాప్తులో తెలిసింది. నిందితుల మొబైల్ ఫోన్ కూడా అదే రాష్ట్రంలో ఉంది. అనంతరం బృందం సభ్యులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు’’ అని తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో చాలా మంది ఉద్యోగం కోల్పోయారు. అప్పటి నుంచే ఇలాంటి మోసాలు చేయడం ప్రారంభించినట్లు పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. ఇటువంటి స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండేలా వినియోగదారులు చేయగలిగే కొన్ని సూచనలు పాటించాలి. LinkedIn, Naukri.com, Indeed వంటి వాటికి అంకితమైన ప్రామాణికమైన పోర్టల్‌ల నుండి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. అయితే, మీరు తప్పనిసరిగా సోషల్ మీడియా ద్వారా జాబ్‌ల దరఖాస్తు చేస్తే, ఉద్యోగాన్ని అందిస్తున్న ఖాతాను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఇది ఎంత చట్టబద్ధమైనదో తనిఖీ చేయండి. ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న కంపెనీ ఉనికిలో ఉందో లేదో గుర్తించడానికి ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చెక్ చేసుకోవడం కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది.