extramarital affair | Image Used For Representational Purpose Only

Bhubaneswar, April 09: వివాహేతర సంబంధం కేసులో ఒరిసా హైకోర్టు (Orissa High Court) కీలక తీర్పు ఇచ్చింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను (illicit extra-marital partner) అతని భార్య ఫిర్యాదుతో గృహహింస చట్టం (Domestic Violence Act) కింద విచారించలేమని స్పష్టం చేసింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కూడా అతని భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన గృహహింస కేసుపై విచారించడం కుదరదని తెలిపింది. సెక్షన్‌ 2(F) ప్రకారం ఇది సాధ్యం కాదని కోర్టు తెలిపింది. జస్టిస్ శశికాంత మిశ్రా సింగిల్ బెంచ్‌ ధర్మాసనం ఈ తీర్పను ఇచ్చింది.

సుదీర్ కుమార్ కరా అనే మహిళ వేసిన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన భర్త అక్రమసంబంధం పెట్టుకున్న మహిళ తనను హింసిస్తోందని ఆరోపించింది.అయితే ఆమెపై గృహహింస చట్టంకింద విచారణ జరుపలేమని స్పష్టం చేసింది హైకోర్టు.