Chandigarh, April 08: ఇకపై అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 7.30 గంటలకే ఓపెన్ అవుతాయి. మధ్యాహ్నం 2గంటల వరకే పని చేస్తాయి. ఆ తర్వాత అన్ని ఆఫీసులు క్లోజ్ అవుతాయి. ఈ మేరకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త రూల్ మే 2వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ కొత్త రూల్ (Government Announces New timings) తీసుకొచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. పంజాబ్ రాష్ట్రంలో (Punjab). అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు. చల్లదనం కోసం పాట్లు పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది. రూమ్ లో కనీసం ఫ్యాన్ లేనిదే ఉండలేని పరిస్థితి. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది ఏదో ఒక రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కాదు. దాదాపు అన్ని చోట్లా ఇదే సీన్. పంజాబ్ రాష్ట్రంలోనూ ఎండాకాలంలో విద్యుత్ డిమాండ్ (Power demand) పెరిగిపోయింది.
2 ਮਈ ਤੋਂ ਸਾਰੇ ਸਰਕਾਰੀ ਦਫ਼ਤਰਾਂ ਦਾ ਸਮਾਂ ਬਦਲ ਦਿੱਤਾ ਗਿਆ ਹੈ…ਸਵੇਰੇ 7:30 ਵਜੇ ਤੋਂ ਦੁਪਹਿਰ 2 ਵਜੇ ਤੱਕ ਸਾਰੇ ਸਰਕਾਰੀ ਦਫ਼ਤਰ ਖੁੱਲ੍ਹਣਗੇ…ਫ਼ੈਸਲੇ ਨਾਲ ਲੋਕ ਸਵੇਰੇ ਜਲਦੀ ਆਪਣੇ ਕੰਮ-ਕਾਰ ਕਰਵਾ ਲਿਆ ਕਰਨਗੇ…ਗਰਮੀ ‘ਚ ਖੱਜਲ ਨਹੀਂ ਹੋਣਗੇ… pic.twitter.com/rPSxBbbFZP
— Bhagwant Mann (@BhagwantMann) April 8, 2023
దీంతో విద్యుత్ డిమాండ్ ను తగ్గించేందుకు, పవర్ ని సేవ్ చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేశారు. ఇకపై ఆ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 7.30 గంటలకే తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 2 గంటల వరకే పని చేస్తాయి. ఈ కొత్త టైమింగ్స్ మే 2నుంచి అమల్లోకి వస్తాయి. తాను కూడా సీఎంవోకు ఉదయమే చేరుకుంటానని సీఎం భగవంత్ మాన్ (CM Bhagawant Maan) తెలిపారు. మే 2న మొదలై జూలై 15వ తేదీ వరకు ఇవే టైమింగ్స్ కొనసాగుతాయన్నారు.
పంజాబ్ లో (Punjab) ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు.. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉన్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ ఆఫీసుల పనివేళల్లో మార్పు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మార్పు చేసిన పనివేళలు మే 2 నుంచి అమల్లోకి వస్తాయని, జూలై 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్నారు. ఈ నిర్ణయంతో రెండు ప్రధాన ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఒకటి విద్యుత్ ను ఆదా చేయడం, రెండవది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎండాకాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులు సులువుగా చేసుకునేందుకు సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. మండుటెండుల్లో బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉందన్నారు. పని వేళలు మార్చవడం వల్ల ప్రజలు ఉదయాన్నే ఆఫీసులకు వచ్చి తమ పనులను పూర్తి చేసుకోవచ్చన్నారు. అధికారులతో సంప్రదింపుల తర్వాతే అందరి సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భగవంత్ మాన్ చెప్పారు.