Newdelhi, April 8: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ వివాదంపై ఒకవైపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ పార్లమెంటును విపక్షాలు హోరెత్తించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై విపక్షాలు పట్టబట్టాయి. ఈ క్రమంలో ఇతర అంశాలపై పెద్దగా చర్చ జరగకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిసిపోయాయి. దీనిపై శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ గురించి రిపోర్ట్ ఇచ్చిన హిండెన్ బర్గ్ ఎక్కడిది, దాని చరిత్ర ఏమిటని ప్రశ్నించారు. కావాలనే అదానీని టార్గెట్ చేశారని విమర్శించారు. అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయాలని రాహుల్ గాంధీ అనుకోవడం సరికాదని చెప్పారు.
"It seems targeted...no need of JPC": Sharad Pawar on Hindenburg report concerning Adani group
Read @ANI Story | https://t.co/NpKbs0bGXi#SharadPawar #AdaniGroup #HindenburgReport pic.twitter.com/BDrP0OcBVA
— ANI Digital (@ani_digital) April 7, 2023
అంబానీ పెట్రో కెమికల్ రంగంలో ఉన్నారని, అదానీ విద్యుత్ రంగంలో సేవలందిస్తున్నారని... ఇవన్నీ దేశానికి అవసరం లేదా అని ప్రశ్నించారు.ప్రస్తుతం పవార్ వ్యాఖ్యలు విపక్ష పార్టీల్లో కలకలం సృష్టిస్తున్నాయి.