KTR Slams CM Revanth Reddy on Adani Issue(X)

Hyd, Nov 21: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదాని కంపెనీ - తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్...అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు..భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు..అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం అని దుయ్యబట్టారు.

రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో! చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు! ఎలా ఇస్తారో చెప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.  వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు 

Here's Tweet:

తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని... అదానీ తో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత?,మీ అదానీ భాయ్ వాటా ఎంత? ,మీ హైకమాండ్ వాటా ఎంత? అని ఎద్దేవా చేశారు.