BJP MLA Surendra Singh: గోమూత్రంతో కరోనాని తరిమేయండి, రోజూ పరగడుపున రెండు లేదా మూడు మూత‌ల గో మూత్రం తాగండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వీడియో

మీరు పరగడుపున ఏమీ తినకుండా మాత్రమే ఇలా చేయాలని తెలిపాడు. అంతేకాదు ఆవు మూత్రం కరోనాతో పోరడడమే కాకుండా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుందని బీజేపీ ఎమ్మెల్యే చెప్పాడు

BJP MLA Surendra Singh (Photo Credits: Twitter)

Ballia, May 9: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. క‌రోనా వ్యాప్తిని నిలువ‌రించ‌డానికి, ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి ప్ర‌భుత్వాలు విస్తృతంగా టీకాలు పంపిణీ చేయ‌డంతోపాటు, లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూలు విధిస్తున్నాయి. అయితే కొందరు ఈ కరోనా కాలంలో విచిత్ర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA Surendra Singh) గోమూత్రం తాగితే కరోనా పోతుందంటూ అందరూ దాన్ని తాగాలంటూ పిలుపునిచ్చాడు.

ఉత్తర ప్రదేశ్‌లోని బైరియాకు చెందిన సురేంద్ర సింగ్ అనే బిజెపి ఎమ్మెల్యే వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఆవు మూత్రాన్ని (Gaumutra) ఎలా తాగాలో చూపిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో అతడు ఈ విధంగా చెప్పాడు. “నేను ప్రతి ఉదయం బ్రష్ చేసిన తర్వాత ఖాళీ కడుపుతో చల్లటి గో మూత్రాన్ని ఐదు కప్పులు తాగుతాను” అని వీడియోలో పేర్కొన్నాడు. మీరు పరగడుపున ఏమీ తినకుండా మాత్రమే ఇలా చేయాలని తెలిపాడు. అంతేకాదు ఆవు మూత్రం కరోనాతో పోరడడమే కాకుండా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుందని చెప్పాడు.

మద్యం తాగేవారికి కరోనాతో చాలా డేంజర్, కేంద్రం తీరు ఆందోళన కలిగిస్తోందని తెలిపిన ఐఎంఏ, దేశంలో తాజాగా 4,03,738 మందికి కరోనా, కొత్తగా 4,092 మంది మృతి

తాను రోజులో 18 గంట‌లు ప‌నిచేయ‌డానికి అదే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు. రెండు లేదా మూడు మూత‌ల గో మూత్రాన్ని ఒక గ్లాసు నీళ్ల‌లో క‌లుపుకొని ప్ర‌తిరోజు ఉద‌యాన్నే తీసుకోవాల‌ని వీడియో ద్వారా తెలిపారు. అయితే ఆవు పంచకం తీసుకున్న అర‌గంట వ‌ర‌కు ఎలాంటి ప‌దార్థాలు తిన‌డం కానీ తాగ‌డం కానీ చేయ‌వ‌ద్ద‌ని కూడా సూచించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల కేవ‌లం క‌రోనాను మాత్ర‌మే కాకుండా (Drinking Cow Urine To Beat Coronavirus) అనేక రోగాల‌ను న‌యం చేయ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని, ప్ర‌త్యేకంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా చేస్తుంద‌ని వెల్ల‌డించారు. తాను ప్ర‌తిరోజూ తాగుతాన‌ని అందువ‌ల్లే ఆరోగ్యంగా ఉన్నాన‌ని చెప్పారు. సైన్స్‌ను న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా.. ఆవు పంచ‌కంపై మాత్రం అపార‌మైన విశ్వాసం ఉన్న‌ద‌ని చెప్పారు.

Here's Video 

అప్పటి నుంచి ఇది ట్విట్టర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు వీడియోను వారి స్పందనను తెలుపుతున్నారు. కామెంట్లు, షేర్స్ చేస్తున్నారు. గత ఏడాది మార్చిలో కొవిడ్‌ను నివారించడానికి హిందూ మహాసభ ఒక ‘గోమూత్ర పార్టీ’ని కూడా నిర్వహించింది.