Covid in India: మద్యం తాగేవారికి కరోనాతో చాలా డేంజర్, కేంద్రం తీరు ఆందోళన కలిగిస్తోందని తెలిపిన ఐఎంఏ, దేశంలో తాజాగా 4,03,738 మందికి కరోనా, కొత్తగా 4,092 మంది మృతి
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, May 9: భారత్‌లో నిన్న‌ కొత్త‌గా 4,03,738 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,86,444 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కు Coronavirus in India) చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 4,092 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,42,362కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు.37,36,648 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,94,39,663 మందికి వ్యాక్సిన్లు వేశారు.

దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్ వేవ్ పై (Covid Second Wave) కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొంది. తాము కేంద్రానికి అందించిన సలహాలు, సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం అర్థమైందని వెల్లడించింది. రాత్రిపూట కర్ఫ్యూల వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ అస్తవ్యస్తంగా ఉందని, 18 ఏళ్లకు పైబడినవారికి ఎక్కడైనా వ్యాక్సిన్ అందుతోందా? అని నిలదీసింది.

దేశంలో ఆక్సిజన్ కొరత, జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, వారం రోజుల్లోగా టాస్క్‌ఫోర్స్‌ బృందం సేవలు అందుబాటులోకి

కేంద్రం (Center) అనుసరిస్తున్న వ్యాక్సిన్ ప్రక్రియ లోపభూయిష్టమని విమర్శించింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే వ్యాక్సినేషన్ ముందుకు సాగడంలేదని ఆరోపించింది. కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇకనైనా మేల్కోవాలని, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని ఐఎంఏ స్పష్టం చేసింది.

పెను ముప్పుగా మారిన సెకండ్ వేవ్‌, 14 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, మిగతా రాష్ట్రాల్లో నైట్, డే కర్ఫ్యూలు

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నం అవుతుందని, అంతేకాకుండా, కరోనా రోగులకు నిర్విరామంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కొంతమేర ఉపశమనం లభిస్తుందని ఐఎంఏ అభిప్రాయపడింది.

ఆస్పత్రిలో చేరాలంటే కోవిడ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు, నూతన మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు

మద్యం, ధూమపానం అలవాట్లు ఉన్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వీరు కనుక కరోనా బారినపడితే కోలుకోవడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిన్న నిర్వహించిన సంయుక్త వెబినార్‌లో పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ మొదటి దశలో వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిపై ప్రభావం చూపిస్తే రెండో దశలో యువత, చిన్నారులు, గర్భిణులపై చూపిస్తోందని వెబినార్‌లో పాల్గొన్న పీడియాట్రిక్ నిపుణుడు డాక్టర్ చేతన్ ముందాడ, శ్వాసకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ విశ్వేశ్వరన్ పేర్కొన్నారు. చిన్నారుల్లో తీవ్రత ఎక్కువగా ఉండడం లేదని, ఇది కొంత ఊరటనిచ్చే విషయమని అన్నారు. అయినప్పటికీ అప్రమత్తత అవసరమన్నారు. పిల్లలు అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్నా, జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నా, గొంతులో ఇబ్బందిగా ఉన్నా వాటిని కరోనా లక్షణాలుగానే పరిగణించాలని పేర్కొన్నారు.

కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం లేని మెడిసిన్, 2-డీజీ ఔషధాన్ని తీసుకువచ్చిన డీఆర్డీవో, డీఆక్సీ డి గ్లూకోజ్‌కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన డీసీజీఐ

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాతే ఫలితం కనిపిస్తుందని వెబినార్‌లో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా 10-30 శాతం మందికి కొవిడ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజూ బ్రీతింగ్ వ్యాయామం చేయడం ద్వారా ఆక్సిజన్ స్థాయులను పెంచుకోవచ్చన్నారు. మద్యం, పొగ తాగే వారు కనుక కరోనా మహమ్మారి బారినపడితే కోలుకోవడం కష్టమని, వీరిలో మరణాల రేటు కూడా అధికంగా ఉంటోందని నిపుణులు పేర్కొన్నారు.