New Delhi, May 8: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ (COVID-19 lockdown) విధించాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని చాలా రాష్ట్రాలు అనుకోవడం..మరికొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బ తింటామనే ఉద్దేశంతో పాక్షిక లాక్ డౌన్ (imposed strict Coronavirus curbs, curfews) అమల్లోకి తీసుకువచ్చాయి.
ఇప్పుడు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్‌డౌన్ అనంతరం ఢిల్లీ, కర్నాటక విధించగా తాజాగా తమిళనాడు కూడా విధించింది. ఈ విధంగా మొత్తం 14 రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్ (complete lockdown in 14 states) అమల్లో ఉంది. మరి కొన్ని రాష్ట్రాల్లో నైట కర్ఫ్యూ..ఇంకొన్ని రాష్ట్రాల్లో డే కర్ఫ్యూ అమల్లో ఉంది.
బారత్‌లో నిన్న కొత్తగా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు.దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,79,30,960 మంది కోలుకున్నారు. 37,23,446 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు వేశారు.
పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాలు
కేరళ: ఈనెల 16వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్
ఢిల్లీ: 10వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. కేసుల పెరుగుదల నేపథ్యంలో పొడగించే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్: ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంది.
ఉత్తరప్రదేశ్: ఈనెల 10 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది.
హిమాచల్‌ప్రదేశ్: ఈనెల 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్.
తమిళనాడు: మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్
కర్ణాటక: ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్
రాజస్థాన్: ఈనెల 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్
మహారాష్ట్ర: ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.
బిహార్: మే 4 నుంచి 15 వరకు లాక్‌డౌన్
గోవా: మే 9 నుంచి 23 వరకు..
హరియాణా: మే 3 నుంచి మొత్తం వారం రోజుల పాటు 10వ తేదీ వరకు.
మణిపూర్: మే 7 వరకు లాక్డౌన్
ఒడిశా: మే 5 నుంచి 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్
జార్ఖండ్ : మే 5తో లాక్ డౌన్ ముగియగా మే 13 వరకు మళ్లీ పొడించింది.
పాక్షిక లాక్ డౌన్ విధించిన రాష్ట్రాలు
చండీగఢ్: మే 11 వరకు వీకెండ్ లాక్ డౌన్
ఆంధ్రప్రదేశ్: మే 18 వరకు డే టైమ్ లాక్ డౌన్
తెలంగాణ మే 15 వరకు నైట్ కర్ఫ్యూ
పశ్చిమ బెంగాల్ : లాక్ డౌన్ విధించనప్పటికీ కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చింది.
నాగాలాండ్, త్రిపుర, అసోం, పంజాబ్ వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూని అమల్లోకి తీసుకువచ్చాయి.