Mucormycosis: కరోనా మాటున మరో పెను ముప్పు, కోలుకున్నవారిపై బ్లాక్‌‌ ఫంగస్‌ దాడి, మ్యుకోర్‌‌మైకోసిస్‌ సోకి చూపును కోల్పోతున్న పేషెంట్లు, ఈ వ్యాధి ఎలా సోకుతుంది, బ్లాక్‌‌ ఫంగస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి
Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, May 8: కరోనావైరస్ నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్‌‌ ఫంగస్‌‌ (మ్యుకోర్‌‌మైకోసిస్‌‌) ఇన్ఫెక్షన్‌‌ (Black Fungus) భయపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్‌‌ ఫంగస్‌‌ (మ్యుకోర్‌‌మైకోసిస్‌‌) ఇన్ఫెక్షన్‌ (Mucormycosis)‌ భయపెడుతోంది. గుజరాత్‌‌, అహ్మదాబాద్‌‌, ఢిల్లీల్లో ఈ కేసులు కనబడుతున్నాయి. గత 15 రోజుల్లో సూరత్‌‌లో 40 మందికి ఈ ఫంగస్‌‌ సోకగా 8 మందికి కంటిచూపు పోయింది. ఢిల్లీలోని గంగారామ్‌‌ ఆస్పత్రిలోనూ ఇలాంటి కేసులను ఈ రెండ్రోజుల్లో 6 గుర్తించినట్టు డాక్టర్లు చెప్పారు.

ఇప్పటికే దాదాపు 40మంది ఈ ఫంగస్ బారిన పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. వీరిలో 8మంది ఏకంగా చూపును సైతం కోల్పోయారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్ కూడా ప్రాణాపాయం కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే దీనిని చికిత్స ద్వారా నయం చేయవచ్చని, కానీ ఆలస్యమైతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, మరికొన్ని సార్లు ఏకంగా ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మ్యుకోర్‌‌మైకోసిస్‌ గా పిలిచే ఈ బ్లాక్ ఫంగస్ సోకితే రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవి వాతావరణంలో సహజంగా ఉంటాయి. మనుషులకు కూడా అరుదుగా సోకుతూ ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారిలో ఇతర అరోగ్య సమస్యలు ఉన్నవారికి లేదా ఇమ్యూనిటీ వ్యవస్థ తీవ్రంగా స్పందించకుండా ఉపయోగించే స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది.

అవయువ మార్పిడి జరిగిన వారిలో ఐసీయూ ట్రీట్‌‌మెంట్‌‌, ఆర్గాన్‌‌ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌ జరిగిన వారికీ దీని వల్ల ముప్పు ఎక్కువే. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్‌ (Potentially Fatal Fungal Infection)‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌‌లో చేరుతుంది. కొన్ని సందర్భాల్లో శరీరానికైన గాయాల నుంచి కూడా బాడీలోకి చేరుతుంది. ఈ ఫంగస్ (ఒక రకమైన బూజు) గాలిలో ఉంటుంది. పుట్టగొడుగు కోవకు చెందింది. ఇది ఎప్పటినుంచో ఉండేదే. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది సోకుతుంది.

కరోనాతో కంటిచూపు కోల్పోతున్న పేషెంట్లు, తమిళనాడులో రెండు వారాల పాటు లాక్‌డౌన్, దేశంలో తాజాగా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ, 24 గంటల్లో 4,187 మంది కరోనా కారణంగా మృతి

బ్లాక్ ఫంగస్ కరోనా పేషెంట్లలోనే ఎక్కువగా కనిపించడానికి గల కారణాన్ని ఢిల్లీలోని సర్ గంగారామ్ హస్పిటల్‌లోని ఈఎన్‌టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వివరించారు. కరోనా పేషెంట్లలో ఎక్కువ మంది డయాబెటిస్‌తో బాధపడుతుండడం, వారికి కరోనా ట్రీట్‌మెంట్‌లో అందించే ఔషదాల ప్రభావం వెరసి ఈ ఫంగస్ బారిన పడడానికి ఓ కారణంగా వివరించారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ ఫంగస్ కనిపిస్తుందని, అయితే డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడేవారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

కాగా.. గతేడాది కూడా ఈ ఫంగస్ బారిన అనేకమంది పడ్డారని, అనేకమంది చూపు కోల్పోగా, ఇకొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని ఆసుపత్రి ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ మనీష్ ముంజల్ వెల్లడించారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ ఫంగస్ ఎక్కువగా దాడి చేసే అవకాశాలుంటాయని తెలిపారు. ముఖంలోని కండరాలు తిమ్మిరెక్కడం. కళ్ళు ఎర్రబడడం , ఇంకా కళ్ళు వాపుకి గురికావడం అంటే కను గుడ్డు పెద్దది కావడం. ముక్కులో ఒక్క పక్క మూసికొనిపోయినట్టు ఉండడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

తెలంగాణలో మూడు ప్రమాదకర వేరియంట్లు, బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో ఊపిరాడక 12 మంది మృతి, రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు అమల్లోకి, తాజాగా 5,559 మందికి కరోనా, మే 15 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. మ్యూకోర్మిసెటెస్ అనే ఫంగి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ బాధితుల్లోకి ప్రవేశిస్తుంది. ఇది చుట్టూ వాతావరణంలోనే ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది సైనస్ లేదా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. చర్మం తెగినా, కాలినా, ఇతర చర్మ సంబంధిత గాయాల్లోనూ ఈ ఫంగస్ కనిపిస్తుంది. ముఖంలో వాపు కనిపించడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, జ్వరం, నోటిపై భాగంలో నల్లటి గాయాల మాదిరిగా కనిపించి తీవ్రమైన బాధ కలిగిస్తూ పెద్దవువుతుంటాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే బయాప్సీ చేయించుకోవాలి. అలాగే వైద్యుల సలహాతో యాంటీ-ఫంగల్ థెరపీ చేయాలని, లేకపోతే తర్వాతి 24 గంటల్లో మెదడు వరకూ కూడా ఇది వెళ్లవచ్చని వైద్యులు హెచ్చరించారు.

లక్షణాలేంటి?

కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడ్రోజుల్లో బ్లాక్‌‌ ఫంగస్‌‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్‌‌లో చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్‌‌ వరకు వెళ్తుంది. ఇది సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు వంటి లక్షణాలు, కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోయినట్లు కనిపిస్తున్నాయి. తీవ్రమైన డయాబెటిస్‌‌తో ఇబ్బంది పడుతున్న వారు కోలుకునేందుకు డాక్టర్లు స్టెరాయిడ్స్‌‌ ఇస్తున్నారని, వీరిలో ఈ ఇన్ఫెక్షన్‌‌ ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత 2-3 రోజుల్లోనే ఈ ఫంగస్ లక్షణాలు కనిపిస్తాయి. మొదట సైనస్‌లో, తర్వాత మెల్లగా కళ్లలో దీని లక్షణాలు కనిపిస్తాయట. ఈ ఫంగస్ ముక్కులో ఉన్నప్పుడు ఏదో అడ్డం ఏర్పడినట్లు ఉంటుందట. నలుపు రంగులో ముక్కులో కణితలు ఏర్పడతాయట. కళ్లలోకి చేరేసరికి కళ్లు, చెంపల వాపుకు కారణమవుతుందని సూరత్‌లోని ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ సంకేత్ షా తెలిపారు.

ట్రీట్‌‌మెంట్‌‌ ఎలా చేస్తారు?

బ్లాక్‌‌ ఫంగస్‌‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని సైంటిస్టులు చెప్పారు. ముందే గుర్తించి యాంటీఫంగల్‌‌ ట్రీట్‌‌మెంట్​ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చన్నారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిలో యాఫోటెరిసన్‌‌ బీ వంటి యాంటీ ఫంగల్‌‌ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడతారు. ప్రస్తుతం పుణే ఆస్పత్రిలో ఈ ఔషధానికి డిమాండ్ ఏర్పడటంతో కొరత నెలకొంది. పునేలో నిత్యం దాదాపు 1000 వయల్స్ ను వినియోగిస్తున్నారు. కేవలం భయంతో వీడి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీరం డెవలప్ చేసిన ఎల్ఏఎంబీ అనే ఔషధాన్ని కూడా ఉపయోగిస్తున్నారు.