Budget 2023 Highlights: రూపాయి రాక, రూపాయి పోక వివరాలు ఇవిగో, రూ.45.03 లక్షల కోట్లతో 2023 కేంద్ర బడ్జెట్, శాఖల వారీగా కేటాయింపులు, కేంద్ర బడ్జెట్ కీ పాయింట్స్ ఇవే..
ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపొందించారు. అవి వరుసగా సమ్మిళిత అభివృద్ధి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు, భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట, పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువ శక్తి, పటిష్టమైన ఆర్థిక రంగం.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను (Budget 2023 Highlights) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. 2022-23 బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదనే వార్తల నేపథ్యంలో బడ్జెట్ 2023 వచ్చేసింది. ఉదయం 11 గంటలకు ఆమె (nirmala sitharaman) బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగా.. 1 గంట 26 నిమిషాల పాటు కొనసాగింది.కాగా ఇది మూడో పేపర్ లెస్ బడ్జెట్.
ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపొందించారు. అవి వరుసగా సమ్మిళిత అభివృద్ధి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు, భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట, పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువ శక్తి, పటిష్టమైన ఆర్థిక రంగం.
శతాబ్దాల నుంచి భారతీయుల ఆహారమైన మిల్లెట్లకు పెద్దపీట. ప్రపంచ స్థాయిలో మిల్లెట్ హబ్‌గా భారత్‌ను రూపొందించడమే లక్ష్యంగా.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. వ్యవసాయానికి పెద్దపీట, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధిని కేటాయించారు. 102 కోట్ల మందికి 220 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేశామని తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలోనే పయనిస్తోంది. ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకెళ్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేస్తున్నామని మంత్రి నిర్మల ప్రకటించారు. కష్ట కాలంలో మేం తెచ్చిన ఆర్థిక విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రపంచంలో మనది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని మంత్రి తెలిపారు. ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాల సంఖ్య రెట్టింపై రూ. 27 కోట్లకు చేరింది.11.7 కోట్ల గృహాలకు కొత్తగా టాయిలెట్లు నిర్మించాం. భారత తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు. 2024 వరకు ఉచిత ఆహార పంపిణీ పథకం కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఆదాయ పన్ను పరిమితి పెంపు
వ్యక్తిగత ఆదాయ పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 - రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను.... రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను... రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.
ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం. ఎందులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దానిని ఎంపిక చేసుకోవచ్చు.
►2023-24 మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు
కేంద్రానికి రూపాయి రాక బడ్జెట్ వివరాలు
►మొత్తం టాక్స్‌ల రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు
►కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ10.22 లక్షల కోట్లు
►ఇన్‌కం టాక్స్ రూపేణా వచ్చేది రూ.9.01 లక్షల కోట్లు
►GST ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.9.57లక్షల కోట్లు
కేంద్రం నుంచి రూపాయి పోయే బడ్జెట్ వివరాలు
►ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు
►వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ.19.44లక్షల కోట్లు
►వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు
►పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు
రక్షణశాఖ - రూ.5.94 లక్షల కోట్లు
రోడ్డు, హైవేలు - రూ.2.70 లక్షల కోట్లు
రైల్వే శాఖ - రూ.2.41 లక్షల కోట్లు
పౌరసరఫరాల శాఖ - రూ.2.06 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ - రూ.1.6 లక్షల కోట్లు
వ్యవసాయ శాఖ - రూ.1.25 లక్షల కోట్లు
బడ్జెట్ కీ పాయింట్స్
దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక అభివృద్ధి
ఎంఎస్‌ఎంఈల రుణాల వడ్డీ రేటు ఒక శాతం తగ్గింపు
బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం.. చట్ట సవరణకు అనుమతి
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కింద 2లక్షల సేవింగ్స్‌పై 7% వడ్డీ
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పరిమితి రూ.15లక్షల నుంచి 30లక్షలకు పెంపు
సేవింగ్ అకౌంట్ పరిమితి రూ.4.5లక్షల నుంచి 9లక్షలకు పెంపు
ఈ ఏడాదికి సవరించిన ద్రవ్యలోటు 6.4 శాతం
వచ్చే ఏడాది ద్రవ్యలోటు 5.9% ఉండే విధంగా చర్యలు
2026 నాటికి ద్రవ్యలోటు 5శాతం దిగువకు తీసుకురావాలని లక్ష్యం
గతేడాది 31 కోట్ల ఫోన్లు భారత్‌లో తయారయ్యాయి..
భారత్‌లో తయారైన ఫోన్ల విలువ రూ.2.75లక్షల కోట్లు
లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీ 21% నుంచి 13% తగ్గింపు
తగ్గనున్న టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
టీవీ ప్యానల్స్‌పై కస్టమ్ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు
రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వడ్డీ రహిత రుణ సదుపాయం మరో ఏడాది పాటు పొడిగింపు
మరిన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్‌పోర్టులు, హెలీ ప్యాడ్లు
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం రూ.19,700 కోట్లు
ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.38వేల కోట్లు
లడఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.20,700 కోట్లు
గోబర్ధన్ స్కీమ్ కింద 200 బయోగ్యాస్ ప్లాంట్లు
సేంద్రీయ వ్యవసాయం వైపు కోటి మంది రైతులు
తీర ప్రాంత రవాణాకు ప్రాధాన్యత
మిస్టీ పథకం ద్వారా మడఅడవుల అభివృద్ధి
వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధుల కేటాయింపు..
యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన 4.0
రైల్వేలకు రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు
50 ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టుల పునరుద్ధరణ
ట్రాన్స్‌పోర్ట్ రంగానికి ప్రాధాన్యత
నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10వేల కోట్ల అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్
ఏడాదికి అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్ రూ.10వేల కోట్లు
మేక్ ఎ వర్క్ మిషన్ ప్రారంభం
ఈ-కోర్టు ప్రాజెక్టు విస్తరణ కోసం మూడో విడత రూ. 7 వేల కోట్లు
5 జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్‌ల ఏర్పాటు
2070 నాటికి కార్బన రహిత భారత్ లక్ష్యం
కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం కోసం రూ.13.7లక్షల కోట్లు
పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు ఆర్ధిక సాయం
మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు
సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు..
నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ద్వారా కేవైసీ విధానం మరింత సులభతరం
వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్, పాన్‌కార్డ్, డిజీలాక్
రాష్ట్రాల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
వృత్తి కళాకారులకు మరింత చేయూత
11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్ల రూపాయలు అందించాం
గ్రీన్ ఎనర్జీ మా ప్రభుత్వ ప్రాధాన్యత
జమ్మూ కశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీలు
క్లీన్‌ప్లాంట్ కార్యక్రమానికి రూ. 2వేల కోట్లు
చిరు ధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
ఉద్యానవన పంటలకు ఆర్థిక చేయూత
చిన్న, మధ్య తరహా రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలు
ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి
సప్తరిషి పేరుతో 7 రంగాలకు ప్రాధాన్యనిస్తూ బడ్జెట్
2047 నాటికి రక్తహీనత రూపుమాపడం కోసం ప్రత్యేక ప్రణాళిక
50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలు కొనసాగింపు
రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు కేటాయింపు
మూలధన వ్యయం 33% పెంపు రూ. 10లక్షల కోట్లు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన
పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు
18 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం
చిన్నారుల కోసం నాణ్యమైన పాఠ్యాంశాలు, ఉత్తమ పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీ
ఫార్మా రంగంలో పరిశోధనల కోసం కొత్త కార్యక్రమం
దేశవ్యాప్తంగా సహకార సంఘాల వివరాలతో నేషనల్ కో ఆపరేటివ్ డాటాబేస్
సేంద్రీయ సాగుకు పెద్దపీట, కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేలా మార్గదర్శకాలు
ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.79వేల కోట్లతో దేశవ్యాప్తంగా బడుగులకు ఇళ్ల నిర్మాణం
ఉపాధ్యాయులకు శిక్షణ కోసం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొత్త సంస్థ
740 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు, 3.50లక్షల మంది విద్యార్ధులకు బోధన
ఏకలవ్య స్కూల్స్‌లో 38,800 టీచర్ల నియామకం
గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు
PMAY కోసం రూ.79వేల కోట్లు
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)