FM Nirmala (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వేతన జీవులకు భారీ ఊరటనిచ్చారు.

ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గించారు. రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ప్రకటించారు. పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంచారు. 9 లక్షల ఆదాయం ఉన్న వారికి 5% టాక్స్‌, రూ.9లక్షల నుంచి 15లక్షల వరకు 10శాతం పన్ను, రూ.15లక్షలు దాటితే 30శాతం పన్ను విధిస్తామని తెలిపారు.

ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 - రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం. ఎందులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దానిని ఎంపిక చేసుకోవచ్చు.

వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతాం, పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలపై దృష్టి సారిస్తామని తెలిపిన నిర్మలా సీతారామన్

2030 నాటికి 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తి, దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈల రుణాల వడ్డీ రేటు ఒక శాతం తగ్గింపు, బ్యాంకింగ్‌ సేవలు మరింత సులభతరం.. చట్ట సవరణకు అనుమతి వంటివి ప్రవేశపెట్టారు. ఈ ఏడాదికి సవరించిన ద్రవ్యలోటు 6.4 శాతం అని నిర్మల తెలిపారు.

బడ్జెట్లో విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, 5G సేవల యాప్‌ల అభివృద్ధి కోసం ఇంజనీరింగ్ కాలేజీలలో 100 ల్యాబ్‌లు

సీనియర్ సిటిజన్‌ సేవింగ్ స్కీమ్ పరిమితి రూ.15లక్షల నుంచి 30లక్షలకు పెంచారు. సేవింగ్ అకౌంట్ పరిమితి రూ.4.5లక్షల నుంచి 9లక్షలకు పెంచారు. మహిళా సమ్మాన్ సేవింగ్‌ స్కీమ్ కింద 2లక్షల సేవింగ్స్‌పై 7% వడ్డీని ప్రకటించారు.