Lockdown Relaxations: వైన్స్ షాపులు తెరుచుకోనున్నాయా? దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం. ఏవేవి తెరుచుకోనున్నాయి, ఏవి మూసి ఉండనున్నాయి, వేటికి అనుమతి లభించిందో తెలుసుకోండి

మునిసిపల్ కార్పొరేషన్లు మరియు మునిసిపాలిటీల పరిధికి వెలుపల ఉండే మార్కెట్ కాంప్లెక్సులు తెరవడానికి అనుమతించబడతాయి......

Shops reopen in Mumbai after MHA order (Photo Credits: ANI)

New Delhi, April 25: దేశవ్యాప్త లాక్ డౌన్ నుంచి ప్రజలకు, వ్యాపారులకు కొంత ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ప్రకటించింది. 50 శాతం సిబ్బందితో మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని రకాల దుకాణాలను శనివారం నుంచి తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే మాల్స్ మరియు మార్కెట్ కాంప్లెక్సులపై ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయి. రెడ్ జోన్లు మరియు కంటైనర్ జోన్లుగా గుర్తించబడిన ప్రాంతాల్లో ఈ సడలింపులు వర్తించవు అని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.

"రాష్ట్రాలలో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయబడిన అన్ని అన్ని రకాల అనవసర వస్తు-సేవల స్టోర్లు, నివాస సముదాయాల్లో, మరియు స్థానికంగా విక్రయించే దుకాణాలు, స్వతంత్రంగా ఉండే షాప్స్ లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. మునిసిపల్ కార్పొరేషన్లు మరియు మునిసిపాలిటీల పరిధికి వెలుపల ఉండే మార్కెట్ కాంప్లెక్సులు తెరవడానికి అనుమతించబడతాయి" అని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వులలో పేర్కొంది.  భారతదేశంలో 24,506 దాటిన కోవిడ్-19 కేసులు, 775కు పెరిగిన మరణాల సంఖ్య

ముస్నిపల్ పరిధిలో మల్టీ-బ్రాండ్ లేదా సింగిల్ బ్రాండ్ షాపులు తెరవడానికి అనుమతించబడలేదు. మున్సిపల్ పరిధి వెలుపల ఉండే వాటికి 50 శాతం సిబ్బంది, మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి నిబంధనలతో అనుమతించబడతాయి. అయితే ఎక్కడా కూడా మాల్స్ తెరవడానికి పర్మిషన్ లేదు.

MHA Order:

వైన్స్ షాపులు, బార్‌లు తెరుచుకోవచ్చా?

 

వైన్స్ షాపులు, బార్‌లు తెరవడానికి అనుమతి లేదు. ఏ రకంగా కూడా మద్యం విక్రయించరాదు. హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 'షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం' కింద రిజిస్ట్రేషన్ చేయబడిన వాటికి మాత్రమే అనుమతి ఉంది. వైన్స్ షాపులు, బార్‌లు ఆ చట్టం పరిధిలోకి రావు. కాబట్టి వాటిపై లాక్డౌన్ ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయి, నిబంధనలు ఉల్లంఘిస్తే తదనుగుణంగా చర్యలు తీసుకోబడతాయి.

తెరవడానికి అనుమతించబడేవి ఏవి?

 

ఇప్పటికీ మూసి ఉండేవి

 

కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వులు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వాహకులకు పంపబడ్డాయి. లాక్డౌన్ అమలుకు సంబంధించి మిగతా అన్ని మార్గదర్శకాలను యధావిధిగా కొనసాగుతాయి.