COVID Vaccination: భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్న కొవిడ్ వ్యాక్సిన్, టీకా పంపిణీపై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, తొలి దశలో ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యం
ఇందుకు తగినట్లుగా టీకా పంపిణీపై కేంద్రం ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం వివరణాత్మక మార్గదర్శకాలు విడుదల చేసింది.....
New Delhi, December 14: భారతదేశంలో కొవిడ్19కు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానునట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇందుకు తగినట్లుగా టీకా పంపిణీపై కేంద్రం ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం వివరణాత్మక మార్గదర్శకాలు విడుదల చేసింది.
రోజుకు ప్రతి సెషన్‌లో 100-200 మందికి టీకాలు వేయడం, ఏదైనా ప్రతికూల ప్రభావం కనిపిస్తే వెంటనే వైద్యం అందించేలా 30 నిమిషాలు వారిని పర్యవేక్షించడం మరియు ఒకేసారి ఒక లబ్ధిదారుని మాత్రమే అనుమతించడం వంటివి కొవిడ్ -19 ఇనాక్యులేషన్ డ్రైవ్ కోసం కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలలో ఉన్నాయి. ఇటీవల రాష్ట్రాలకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (కో-విన్) వ్యవస్థ కరోనావైరస్ వ్యాక్సిన్ల కోసం నమోదు చేయబడిన లబ్ధిదారులను రియల్ టైమ్ ప్రాతిపదికన గుర్తించడానికి ఉపయోగించబడుతుంది.
మొదటి విడతలో హెల్త్‌కేర్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారు, 50 ఏళ్ల లోపు ఉండి ఇతర దీర్ఘకాలిక రోగాలు కలిగిన వారితో సహా దాదాపు 30 కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
- ముందుగానే రిజిస్టర్ చేయబడిన లబ్ధిదారులకు మాత్రమే ప్రాధాన్యత ప్రకారం టీకాలు వేయబడతాయి. ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్లకు ఎటువంటి అనుమతులు లేవు.
- వివిధ తయారీదారులకు చెందిన COVID-19 వ్యాక్సిన్లు ఒకదానికొకటి కలవకుండా ఏదైనా ఒక జిల్లాకు పంపిణీ చేయబడే వ్యాక్సిన్ పూర్తిగా ఒకటే తయారీదారుకు చెందినదై ఉండాలని రాష్ట్రాలకు సూచించింది.
- టీకా కంటైనర్లు ప్రత్యక్ష సూర్యకాంతికి బహిర్గతం చేయకుండా ఉండటానికి అన్ని చర్యలు తీసుకోవాలి.
- లబ్దిదారుడు వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చేంతవరకు వ్యాక్సిన్ కంటైనర్ల మూతలు తెరవకూడదు, టీకా వేసిన వెంటనే వాటి మూతలను బిగించి ఉంచాలి..
- కొన్ని COVID-19 టీకా యొక్క లేబుల్‌పై వ్యాక్సిన్ వైయల్ మానిటర్లు (VVM) మరియు ఎక్స్పైరీ తేదీలు ఉండకపోవచ్చు. అయినప్పటికీ వీటిని కూడా ఉపయోగించవచ్చు. టీకాల పంపిణీ పూర్తైన తర్వాత మిగిలిపోయిన వ్యాక్సిన్ కంటైనర్లను జాగ్రత్తగా బిగించి తిరిగి కోల్డ్ స్టోరేజ్ పాయింట్‌కుపంపాలి.
అలాగే నిర్ధిష్ట తేదీ వరకు ఎంత మోతాదు వ్యాక్సిన్ వినియోగించబడింది, ఎంత మంది ప్రయోజనం పొందారు, ఏమైనా ఇబ్బందులున్నాయా? మొదలగు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిందిగా రాష్ట్రాలను కోరింది.