Woman Vet Murder Mystery: అసలేం జరిగింది? కాలిపోయిన స్థితిలో మహిళా వెటర్నరీ డాక్టర్ మృతదేహం లభ్యం, మిస్టరీగా మారిన యువతి మర్డర్, దుండగుల కోసం 15 పోలీసు బృందాల గాలింపు
అందుకు ఆమె, లేదు దగ్గర్లో బస్ స్టాప్ వరకు తీసుకెళ్లి అక్కడ చేయించుకుంటానని చెప్పింది. దానికి వారు.....
Hyderabad, November 28: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ (Shadnagar) పట్టణం చటాన్ పల్లి వంతెన వద్ద 26 ఏళ్ల వయసు గల యువతి దారుణ హత్యకు గురైంది. యువతిని కొంతమంది దుండగులు అడ్డగించి, తదనంతర పరిణామాలతో ఆమెను పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతురాలిని నవాబ్ పేట మండలంలో పనిచేసే వెటర్నరీ డాక్టర్ (Woman Veterinarian) గా గుర్తించారు. కూతురు హత్య విషయం తెలుసుకున్న తెలిసిన కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి కూతురు మృతదేహాన్ని గుర్తించి షాక్ కు గురయ్యారు. అయితే ఆ యువతిని ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయం మాత్రం మిస్టరీగా మారింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. యువ వైద్యురాలు బుధవారం విధులకు వెళ్తున్నాని చెప్పింది. అయితే తన స్కూటీ టైర్ పంక్చర్ అవడంతో చటాన్ పల్లి వంతెన సమీపంలో అక్కడే వదిలేసి తాను పనిచేసే వెటర్నరీ హాస్పిటల్ కు వెళ్లిపోయింది. విధులు ముగించుకుని తిరిగి వచ్చేటపుడు ఆ స్కూటీ కోసం తిరిగి తీసుకువెళ్లిందుకు వచ్చి స్కూటీని తోసుకుంటూ వెళ్తుంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది లారీ డ్రైవర్లు "మేడం మీ స్కూటీ టైర్ పంక్చర్ అయింది, మేం రిపేర్ చేస్తాం అన్నారు". అందుకు ఆమె, లేదు దగ్గర్లో బస్ స్టాప్ వరకు తీసుకెళ్లి అక్కడ చేయించుకుంటానని చెప్పింది. దానికి వారు, కాదు మేడం రిపేర్ షాప్ దగ్గర్లో లేదు, చీకటైతే మీకు కష్టమవుతుంది అని యువతిని నమ్మించి, స్కూటీని ఒక యువకుడికి ఇచ్చి పంపించారు. దీంతో అక్కడ యువతి ఒంటరి అయిపోయింది. భయపడుతూ వెంటనే తన చెల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇక్కడంతా లారీ డ్రైవర్స్ ఉన్నారు. స్కూటీని రిపేర్ కు పంపించారు. నాకు భయంగా ఉంది పాప, కొద్ది సేపు మాట్లాడు అంటూ చెప్పింది.
అక్క మాటల్లోని తీవ్రతను, తన భయాన్ని అంచనా వేయని ఆమె చెల్లి ఎప్పుడూ మాట్లాడేలాగే సాధారణంగా మాట్లాడుతూ పోయింది. అయితే టోల్ ప్లాజా వద్ద ఉండమని ఒక మంచి సలహా అయితే ఇచ్చింది. వెంటనే నాకు భయం వేస్తుంది అంటూ ఫోన్ కట్ చేసింది. తిరిగి ఆమె నుంచి ఎలాంటి జవాబు రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె శరీరం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. నగరం నిద్రపోతున్న వేళ అరణ్య రోదనే అయిన ఆమె ఆర్తనాదాలు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రాథమికంగా మర్డర్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఈ హత్యకు పాల్పడిన దుండగుల పట్టుకునేందుకు 15 పోలీసు బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.