Chhattisgarh Shocker: కామంతో రగిలిన యువకుడు, అసహజ సెక్స్ చేయాలంటూ బాలుడిపై ఒత్తిడి, నో చెప్పడంతో దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ 20 ఏళ్ల యువకుడు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ మైన్ బాలుడిని ( Man Kills Boy ) చంపేశాడు. తనతో అసహజ శృంగారం చేయాలని ఆ బాలుడిని ఈ కామాంధుడు ఒత్తిడి చేయడంతో అతను భయపడి దానిని (Refusing to Have Unnatural Sex) తిరస్కరించాడు. దీంతో ఆవేశం పట్టలేని ఆ యువకుడు బాలుడిని అత్యంత క్రూరంగా చంపేశాడు.
Raipur, Jan 26: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ మైన్ బాలుడిని ( Man Kills Boy ) చంపేశాడు. తనతో అసహజ శృంగారం చేయాలని ఆ బాలుడిని ఈ కామాంధుడు ఒత్తిడి చేయడంతో అతను భయపడి దానిని (Refusing to Have Unnatural Sex) తిరస్కరించాడు. దీంతో ఆవేశం పట్టలేని ఆ యువకుడు బాలుడిని అత్యంత క్రూరంగా చంపేశాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంకజ్ విశ్వకర్మ అనే యువకుడు స్థానికంగా ఉన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడిని మచ్చిక చేసుకుని తనతో అసహస సెక్స్ చేయాలని ఒత్తిడి చేశాడు. అసభ్యకరమై వీడియోలను చూపుతూ అలా చేయాలని వేధింపులకు గురి చేశాడు. బాలుడు దానిని తిరస్కరించడంతో అతనిపై కోపం పెంచుకున్న విశ్వకర్మ మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ బాలుడిని పదునైన కత్తితో పొడిచి ( Chhattisgarh Man Kills Boy) చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడు. తమ బిడ్డ కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పంకజ్ విశ్వకర్మ ఆ బాలుడిని బీజభట్ట మురుమ్ గని సమీపంలోని ఓ ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్లి సోమవారం పదునైన ఆయుధంతో హత్య చేసి మృతదేహాన్ని దాచిపెట్టి పారిపోయాడని బెమెతర పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమ్ ప్రకాష్ అవధియా తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేయడంతో విశ్వకర్మపై విచారణ చేపట్టామని ఆయన తెలిపారు.