SC on Party Poll Manifesto: పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారు, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఆ వాగ్దానాలను ‘అవినీతి’గా పరిగణించలేమని వెల్లడి

హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్‌ చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు

Supreme Court (Credits: X)

New Delhi, May 27: రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది. హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్‌ చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిని అవినీతిగా పరిగణించలేమని పిల్‌ను తోసిపుచ్చింది.

పిటిషనర్‌ వాదన వింతగా ఉందని జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ వీకే విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్‌ అభిప్రాయపడింది. కాగా, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు సంబంధించిన మరో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. చామరాజనగర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీ జెడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ గెలుపొందారు. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు అవినీతి కిందకే వస్తాయని, అందుకే ఆ పార్టీ నుంచి గెలుపొందిన జమీర్‌ను పక్కన పెట్టాలని కోరుతూ శశాంక జె. శ్రీధర అనే ఓటరు స్థానిక హైకోర్టును ఆశ్రయించాడు.  క్యాన్సర్‌తో పాటు కిడ్నీ వ్యాధుల లక్షణాలు, అరవింద్ కేజ్రీవాల్ ఆకస్మిక బరువు తగ్గుదల, మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

దీనిపై విచారించిన కర్ణాటక హైకోర్టు.. తాము అమలు చేయాలనుకుంటున్న విధానాల గురించి ఏదైనా పార్టీ ప్రకటించడాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 కింద అవినీతిగా పరిగణించలేమని పేర్కొంది. వాటిని సంక్షేమ విధానాలుగానే చూడాలని, ఆర్థికపరంగా అవి సరైనవేనా, కాదా అనేది వేరే విషయమని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ శశాంక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆయన వాదనను తోసిపుచ్చింది.



సంబంధిత వార్తలు