Gas Cylinder Price: సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు, గృహవినియోగ సిలిండర్‌పై రూ.50 పెంపు, ఇప్పటికే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలతో సతమతం

పెరుగుతున్న ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. వంటగ్యాస్ (Cooking Gas) ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (Cooking Gas) ధర రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

LPG sees price drop of more than Rs 160 per cylinder (Photo-PTI)

New Delhi, May 07: పెరుగుతున్న ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. వంటగ్యాస్ (Cooking Gas) ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (Cooking Gas) ధర రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెరిగిన ధరతో సిలిండర్ (Cylinder) ధర రూ. 1052కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల పెరుగుదలతో పాటు పెట్రోల్ (ష్ట్రాఒఇఏన), డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదవర్గాల ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఈ క్రమంలో పేద వర్గాలుసైతం అధికంగా వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వారికి పెనుభారంగా మారనుంది.

కొద్దిరోజుల క్రితమే 19 కిలోల వాణిజ్య సిలిండర్ (Commercial gas) ధర పెరిగిన విషయం విషయం తెలిసిందే. దీంతో మే1 నుంచి హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరింది. ఇక ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వెళ్తున్నాయి ఆయిల్ కంపెనీలు. అయినప్పటికీ సామాన్యులపై భారం తగ్గించేలా కేంద్రం ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now