Coronavirus in India: వ్యాక్సిన్ ఇప్పట్లో రావడం అనుమానమే, లక్ష దాటిన మరణాల సంఖ్య, దేశంలో తాజాగా 79,476 మందికి కరోనా, 54,27,707 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌గా 9,44,996 కేసులు
దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల లక్షా 842 మంది (COVID 19 Deaths in India) చనిపోయారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 79,476 కరోనా పాజిటివ్ కేసులు (coronavirus tally in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,73,545కి చేరింది. ఇందులో 9,44,996 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 54,27,707 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
New Delhi, October 3: దేశంలో నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు కొత్తగా 1069 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల లక్షా 842 మంది (COVID 19 Deaths in India) చనిపోయారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 79,476 కరోనా పాజిటివ్ కేసులు (coronavirus tally in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,73,545కి చేరింది. ఇందులో 9,44,996 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 54,27,707 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత వారం రోజుల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గిందని తెలిపింది. ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో కరోనా బాధితులు కోలుకుంటుండటంతో యాక్టివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. నిన్న నమోదైన కేసుల్లో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 76.62 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 2,61,313 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని పేర్కొంది. దేశంలో అక్టోబర్ 2 వరకు మొత్తం 7,78,50,403 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 11,32,675 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.
సాధారణ ప్రజలకు 2020–21 ఏడాది మధ్య నాటికి కూడా సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో నిమగ్నమైన కొందరు నిష్ణాతులు చెప్పారు. కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు, 2020 జూన్ చివరలో టీకా తయారీ రంగంలో పనిచేస్తున్న 28 మంది పరిశోధకులపై ఒక సర్వే నిర్వహించారు. అమెరికా చెపుతున్నట్టు 2021 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వీరిలో చాలా మంది చెప్పారని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జొనాథన్ కిమ్మెల్మాన్ అన్నారు. కనీసం 2022 నాటికైనా అందుబాటులోకి వస్తే అది గొప్ప విషయమేననీ, సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ముందు, వ్యాక్సిన్ తయారీలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.