Coronavirus: కరోనాపై యుద్ధానికి రూ.7900 కోట్లు రెడీ, ఏడాది పాటు ప్రధాని,రాష్ట్రపతి,ఎంపీల జీతాల్లో 30 శాతం కోత, ఎంపీల్యాడ్స్ స్కీం రెండేళ్ల పాటు రద్దు

దేశాధ్యక్షుల నుంచి ప్రజాప్రతినిధులు వరకూ ప్రతి ఒక్కరి జీతంలోనూ ప్రభుత్వం కోత విధించింది. కొవిడ్ 19పై పోరాడేందుకు నిధులు సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత (30 percent salary cut) విధించాలని నిర్ణయించారు.

PM Narendra Modi in Lok Sabha (Photo Credits: ANI)

New Delhi, April 7: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి (Coronavirus Pandemic) వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కేంద్ర కేబినెట్‌ (Union Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాధ్యక్షుల నుంచి ప్రజాప్రతినిధులు వరకూ ప్రతి ఒక్కరి జీతంలోనూ ప్రభుత్వం కోత విధించింది. కొవిడ్ 19పై పోరాడేందుకు నిధులు సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత (30 percent salary cut) విధించాలని నిర్ణయించారు. ముంబై ఆస్పత్రిలో కరోనా కల్లోలం

అలాగే రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్‌ నిధులు (MPLAD Fund)నిలిపివేయాలని నిర్ణయం​ తీసుకున్నారు. కన్సోలిడేట్ ఫండ్ కింద రూ.7వేల 900కోట్లు ఎంపీల్యాడ్స్ స్కీం నుంచి ప్రభుత్వానికి అందుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ ( Prakash Javadekar) తెలిపారు. కాగా లాక్ డౌన్ ప్రకటించడంతో భారత ఎకానమీపై పెను ప్రభావమే పడింది. ఇప్పుడీ రకంగా జీతాల్లో కోత విధించి దానిని ప్రభుత్వ నిధులకు జోడించాలని గవర్నమెంట్ యోచిస్తోంది.

 Prakash Javadekar's Press Conference:

కేంద్ర మంత్రి జవదేకర్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు అన్ని రాష్ట్రాల గవర్నర్లు కలిసి సంవత్సరం పాటు జీతాల్లో కోత ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తమ వేతనాలను తగ్గించేందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంగీకరించారు. వేతనాల కోత ద్వారా సమకూరిన నిధులను కన్సాలిడేషన్‌ ఫండ్‌కు జమ చేస్తారు.

మీరంతా చావు కోసమే చూస్తున్నారు

ఇవి కేబినెట్‌ నిర్ణయాలని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్‌ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తే రూ 7900 కోట్లు సమకూరుతాయని మంత్రి తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4067కు పెరిగింది.