COVID-19 New Strain: ఒక్కరోజులోనే 20 కొత్త వైరస్ కేసులు, దేశంలో 58కి చేరుకున్న క‌రోనా న్యూ స్ట్రెయిన్ కేసులు, ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

దేశంలో ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గుతుండ‌గానే మ‌రోవైపు యూకేలో విజృంభిస్తున్న క‌రోనా న్యూ స్ట్రెయిన్ (COVID-19 New Strain) క‌ల‌క‌లం రేపుతున్న‌ది. దేశంలో కొత్త వేరియంట్‌ కరోనా కేసులు (Coronavirus New Strain) రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 58కి చేరింది. నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా 20 యూకే కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.

COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, January 5: దేశంలో ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గుతుండ‌గానే మ‌రోవైపు యూకేలో విజృంభిస్తున్న క‌రోనా న్యూ స్ట్రెయిన్ (COVID-19 New Strain) క‌ల‌క‌లం రేపుతున్న‌ది. దేశంలో కొత్త వేరియంట్‌ కరోనా కేసులు (Coronavirus New Strain) రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 58కి చేరింది. నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా 20 యూకే కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 58 మందిలో కొత్త రకం కరోనా లక్షణాలు (Coronavirus Mutant) బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నాటికి 38 మందిలో న్యూ స్ట్రెయిన్ ధృవీకరణ కాగా, మంగళవారం కొత్తగా మరో 20 మందిలో న్యూ స్ట్రెయిన్ బయటపడిందని వెల్లడించింది

యూకేలో రెండు వారాల క్రితం క‌రోనా న్యూ స్ట్రెయిన్ ప్ర‌భావం మొద‌లైంది. మునుప‌టి క‌రోనా వైర‌స్ కంటే ఈ కొత్త ర‌కం క‌రోనా ఉత్ప‌రివర్త‌నం అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న‌ద‌ని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ఇటీవ‌ల యూకే నుంచి భార‌త్‌కు వ‌చ్చిన వారి ద్వారా ఈ న్యూ స్ట్రెయిన్ దేశంలో ప్ర‌వేశించింది. భార‌త్‌తోపాటు డెన్మార్క్‌, నెద‌ర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇట‌లీ, స్వీడ‌న్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జ‌ర్లాండ్, జ‌ర్మ‌నీ, కెన‌డా, జ‌పాన్‌, లెబ‌నాన్‌, సింగ‌పూర్ దేశాల్లో కూడా న్యూ స్ట్రెయిన్ విజృంభ‌ణ మొద‌లైంది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనాలంటే రూ. 400-రూ.600 పెట్టాలి, ధరల వివరాలను వెల్లడించిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా, దేశంలో తాజాగా 16,375 మందికి కరోనా పాజిటివ్

ఇదిలా ఉంటే దేశంలో ఒకవైపు కోవిడ్‌-19కేసులు తగ్గుముఖంపడుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు కొత్తకరోనా కేసుల విస్తరణ మాత్రం ఆందోళన పుట్టిస్తోంది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్‌ గేబ్రియేసస్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ఉనికిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ కనుగొనే క్రమంలో ప్రపంచలోని అన్ని దేశాలకంటే భారత్‌ ముందుంది అంటూ అభినందించారు.

దేశంలో మరో కల్లోలం..అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్న బర్డ్‌ ఫ్లూ వైరస్‌, కేరళలో 12000 బాతులు మృత్యువాత, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను ఇప్పటికే వణికించిన హెచ్‌5ఎన్‌8 వైరస్

Here's WHO Tedros Adhanom Ghebreyesus Tweet

టీకాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తన మనసులోని మాటను బయటపెట్టారు. అదే విధంగా డబ్ల్యూహెచ్‌- భారత్‌ కలిసికట్టుగా ముందుకు సాగితే అత్యంత ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేయవచ్చని టెడ్రోస్‌ పేర్కొన్నారు.

కొత్త షాకింగ్ న్యూస్, మొత్తం నాలుగు కరోనా స్ట్రెయిన్లు, కీలక ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్ఓ, బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారిలో 40 మందికి కరోనా వైరస్

తద్వారా ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న బలహీన వర్గాలకు వ్యాక్సినేషన్‌ చేసేలా చర్యలు చేపట్టవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19పై పోరాటంలో నరేంద్ర మోదీ గొప్పగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కితాబిచ్చారు. ఈ మేరకు టెడ్రోస్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు

కాగా సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా కోవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌లకు దేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now