New Delhi, January 5: కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల (India Covid Update) చేసింది. దేశంలో గత 24 గంటల్లో 16,375 మందికి కరోనా నిర్ధారణ (COVID-19 Cases in India) అయింది. అదే సమయంలో 29,091 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 201 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,850కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,75,958 మంది కోలుకున్నారు. 2,31,036 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
ఇదిలా ఉంటే దేశీయంగా ఆక్స్‌ఫర్డ్ టీకా (University of Oxford) ఉత్పత్తి, పంపిణీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టనుంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్ టీకా ’కోవిషీల్డ్’ను (Covishield) భారత ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల చొప్పున(సుమారు 200– 280 రూపాయలు), ప్రైవేట్ మార్కెట్లో 6–8 డాలర్ల (సుమారు 400–600 రూపాయలు) చొప్పున విక్రయిస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేశామని అదర్ చెప్పారు.
తొలిదశలో భారత ప్రభుత్వానికి, జీఏవీఐ (గ్లోబల్ అలయన్స్ ఫర్ వాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్స్) దేశాలకు అందిస్తామని, తర్వాతే ప్రైవేటు మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన తెలిపారు. తమ వ్యాక్సిన్ అందరికీ అందుబాటు ధరలో ఉండాలన్నదే తమ ప్రయత్నమన్నారు.
ఆదర్ పూనావాలా చెబుతున్న ప్రకారం చూస్తే రెండు డోసులకు కలిపి ప్రభుత్వానికి సుమారు 400–600 రూపాయలు, ప్రైవేట్ మార్కెట్లో రూ. 800–1,200 వరకు ఉంటుందనే తెలుస్తోంది. అయితే మూడు లేదా రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ కోసం మొత్తం మీద రూ. 1000 నుంచి రూ. 2 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ అందజేయడంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. డీసీజీఐ అనుమతి అనంతరం 7–10 రోజుల్లో టీకా పంపిణీకి రెడీగా ఉంటుందన్నారు. దేశీయ అవసరాలు తీరే వరకు టీకాను ఎగుమతి చేయవద్దని సీరమ్‌ను డీసీజీఐ ఆదేశించడంపై స్పందిస్తూ, ప్రభుత్వంతో అనుమతి పొందిన అనంతరమే ఎగుమతులు ఆరంభిస్తామన్నారు. తమ వ్యాక్సిన్ 100 శాతం సమర్ధవంతంగా పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.