New Coronavirus Strain: కొత్త షాకింగ్ న్యూస్, మొత్తం నాలుగు కరోనా స్ట్రెయిన్లు, కీలక ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్ఓ, బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారిలో 40 మందికి కరోనా వైరస్
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, January 3: చైనాలో తొలుత కరోనా వైరస్ బయటపడిందని మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు..అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు రకాల కరోనా స్ట్రెయిన్లు (4 Types of Coronavirus Strain) వెలుగులోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా ప్రకటించింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ జరిగిన కొన్న ఆసాధారణ ఘటనల వెనుక ఈ కొత్త వేరియంట్లు ఉండి ఉండొచ్చని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

చైనాలో తొలిసారిగా కరోనా (Coronavirus Variant) బయటపడిన తరువాత గత ఏడాది జనవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ ఉనికిలోకి వచ్చిందని, ఈ స్ట్రెయిన్‌యే అత్యధికంగా వ్యాపించిందని WHO చెప్పింది. జూన్ 2020 నాటికి అత్యధిక శాతం కేసులు ఈ స్ట్రెయిన్ కారణంగానే సంభవించాయట. ఇక ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మూడో స్ట్రెయిన్ (New Coronavirus Strain) బయటపడింది. డెన్మార్క్‌లో తొలిసారిగా ఉనికి లోకి వచ్చిన ఈ స్ట్రెయిన్‌కు శాస్త్రవేత్తలు క్లస్టర్-5గా నామకరణం చేశారు. మానవుల రోగ నిరోధక శక్తిని ఈ స్ట్రెయిన్ దీటుగా ఎదుర్కొగలదన్న ఆందోళనను అప్పట్లో కొందరు శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు.

కొత్త కరోనావైరస్ జాడ తెలిసింది, సార్స్ - కోవ్-2 వేరియంట్ జన్యు క్రమాన్ని కనుగొన్నామని తెలిపిన ఐసీఎంఆర్, దేశంలో తాజాగా 18,177 మందికి కోవిడ్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు

మూడవ స్ట్రెయిన్ గా దక్షిణాఫ్రికాలో మరో స్ట్రెయిన్ కళ్లు తెరిచింది భయాందోళనలు కలుగు చేసింది. ఇక డిసెంబర్ నెలలో బ్రిటన్‌లో మరో కరోనా స్ట్రెయిన్ నాలుగవదిగా ఉనికిలోకి వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న కరోనా వైరస్‌తో ఈ కొత్త స్ట్రెయిన్‌కు ఫైలోజెనెటిక్ సంబంధం లేదన్న విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో..నిపుణులకు ఈ స్ట్రెయిన్ పుట్టుక ఓ చిక్కుముడిగా మారింది.

అయితే..దక్షిణాఫ్రికా, బ్రిటన్‌లకు చెందిన స్ట్రెయిన్ల కారణంగా వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు రాలేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి చెందే వేగం మాత్రమే పెరిగిందని అంటున్నారు. కరోనా అనేది ఆర్‌ఎన్ఏ వైరస్ కాబట్టి.. వాటిల్లో జన్యుమార్పులు సహజమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్త కరోనావైరస్ టెన్సన్, యుకె నుంచి వచ్చే వారి కోసం కొత్త గైడ్ లెన్స్ విడుదల చేసిన కేంద్రం, కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

ఇదిలా ఉంటే బ్రిటన్ నుంచి ఢిల్లీకి వచ్చినవారిలో 40 మందికి కొత్త కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఢిల్లీలో తాజాగా 494 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలను తెలియజేసింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కరోనా కారణంగా 14 మంది మృతి చెందారు. ఇదే విషయమై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ కరోనా కేసులు తగ్గుతున్న నేపధ్యంలో పడకల సంఖ్యను తగ్గించినప్పటికీ, ఇంకా 10,500 నుంచి 11,000 పడకలు ఖాళీగానే ఉన్నాయన్నారు.

ప్రస్తుతం కేవలం 2,000 మంది మాత్రమే ఆసుపత్రులలోని పడకల సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల గురించి ప్రస్తావిస్తూ, బ్రిటన్ నుంచి వచ్చిన 40 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించామని వీరిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాగా ఢిల్లీవాసులందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామన్నారు. ప్రతీరోజూ లక్షమందికి టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, తొలుత ఈ టీకాలను ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తామని తెలిపారు.