Covid Updates: దేశంలో తాజాగా 15,144 మందికి కరోనా, తెలంగాణలో తాజాగా 299 కరోనా కేసులు నమోదు, ఏపీలో 114 మందికి కోవిడ్ పాజిటివ్, దేశ వ్యాప్తంగా 1,52,274 మంది కరోనాతో మృత్యువాత

వైరస్‌ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని, మరో 181 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారని చెప్పింది.

Coronavirus in AP (Photo Credits: PTI)

New Delhi, Jan 17: దేశంలో గడిచిన 24గంటల్లో 15,144 కరోనా పాజిటివ్‌ కేసులు (Covid Updates) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వైరస్‌ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని, మరో 181 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,57,985కు (Coronavirus in India) పెరిగింది. ప్రస్తుతం 2,08,826 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది.

ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,96,885 మంది కోలుకున్నారని.. 1,52,274 మంది మృత్యువాత పడ్డారని (Covid Deaths) వివరించింది. ఇదిలా ఉండగా శనివారం 7,77,377 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) చెప్పింది. ఇప్పటి వరకు 18.65కోట్లకుపైగా నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

ఇక తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో (Telangana Coronavirus) కొత్తగా 299 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 2,91,666 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు.

వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్, తొలి దశలో లక్షా అరవై వేల మందికి తొలి డోసు, కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్‌ కుమార్‌కు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా కృతజ్ఞతలు

మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,577 మంది మృతి చెందారు. తెలంగాణలో 4,191 యాక్టివ్ కేసులున్నాయి. , 2,85,898 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా వాడాలని వైద్యులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,542 మందికి కరోనా పరీక్షలు చేయగా 114 మందికి పాజిటివ్‌ (AP Coronavirus) వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,824కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 326 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,76,372 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,987. వైరస్‌ బాధితుల్లో కొత్తగా ఒక్కరు కూడా మృత్యువాత పడలేదు.. మొత్తం మృతుల సంఖ్య 7,139గా ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif