Rahul Gandhi Letter to Parag Agrawal: మరోసారి ట్విట్టర్ వర్సెస్ రాహుల్ గాంధీ, నా ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారంటూ ట్విట్టర్ సీఈవోకు లేఖ, అలాంటిదేమీ లేదంటూ ట్విట్టర్ రిప్లై
తన ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల తన స్వరాన్ని నొక్కి పెట్టేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు లేఖ కూడా రాశారు.
New Delhi, January 27: ట్విట్టర్ (Twitter)పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). తన ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల తన స్వరాన్ని నొక్కి పెట్టేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ (Parag agarwal)కు లేఖ కూడా రాశారు. మోదీ సర్కార్ (Modi Government) ఒత్తిడి చేయడం వల్ల ట్విట్టర్ తన ఫాలోవర్లను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ లేఖలో రాహుల్ పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ చేసిన ఓ ట్వీట్‌ను కూడా ట్విట్టర్ బ్యాన్(Twitter banned) చేసింది.
భారత్‌లో భావ ప్రకటన స్వేచ్ఛను ట్విట్టర్ నియంత్రిస్తున్నట్లు రాహుల్ తన లేఖలో సీఈవో పరాగ్ (Twitter CEO Parag)కు తెలిపారు. ప్రస్తుతం రాహుల్‌కు ట్విట్టర్‌లో 19.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో 8 రోజుల పాటు రాహుల్ ట్విట్టర్ సస్పెండ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి రాహుల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
రాహుల్ వ్యాఖ్యలపై పై ట్విట్టర్ సంస్థ స్పందించింది. రాహుల్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ లెటర్‌కు కౌంటర్ ఇచ్చిన ట్విట్టర్.. ఫాలోవర్ కౌంట్(Follower Count) అనేది విజిబుల్ ఫీచర్ (Visible feature) అని, నెంబర్ల విషయంలో నమ్మకం ఉండాలని, అవన్నీ వాస్తవ సంఖ్యలే అని సోషల్ మీడియా సంస్థ తెలిపింది. తన ట్విట్టర్ ద్వారా రిప్లై ఇస్తూ.. తమ ప్లాట్‌ఫామ్‌లో ఎటువంటి అవకతవకలు జరగవని, జీరో టాలరెన్స్ ఉంటుందని, స్పామ్ ఉండదని పేర్కొన్నది.
తమ ప్లాట్‌ఫామ్‌లో అవకతవకలకు పాల్పడే వారికి చెందిన మిలియన్ల అకౌంట్లను ప్రతి వారం డిలీట్ చేస్తూనే ఉంటామని ట్విట్టర్ చెప్పింది. ట్విట్టర్ ట్రాన్స్‌పరెన్సీ సెంటర్‌లో దానికి సంబంధించి అప్‌డేట్ చూసుకోవచ్చు అని సూచించింది. కొన్ని అకౌంట్లలో మాత్రం స్వల్ప తేడాను గమనించవచ్చు అని ట్విట్టర్ తెలిపింది. స్పామ్ (Spam), ఆటోమేషన్ (Automation) పొరపాట్లను వ్యూహాత్మకంగా డీల్ చేయనున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. దీర్ఘకాలంలో ఫాలోవర్ల కౌంట్ అనేది ఒడిదిడుకులకు లోనవుతుందని ట్విట్టర్ స్పష్టం చేసింది.