Delhi Fire: దేశ రాజధానిలో మరో ఘోర అగ్ని ప్రమాదం, 9 మంది సజీవ దహనం, మరో ఇద్దరికీ తీవ్రగాయాలు, ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో విషాద ఘటన

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఉన్న వస్త్ర గోడౌన్‌లో (cloth godown in Delhi's Kirari area) జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి (Sanjay Gandhi Memorial Hospital ) తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది (Delhi Fire Department)ఘటన స్థలానికి చేరుకున్నారు.

Kirari Fire (Photo Credits: ANI)

Delhi, December 23:దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఉన్న వస్త్ర గోడౌన్‌లో (cloth godown in Delhi's Kirari area) జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి (Sanjay Gandhi Memorial Hospital ) తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది (Delhi Fire Department)ఘటన స్థలానికి చేరుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

నాలుగు అంతస్తుల భవనంలో ఈ వస్త్ర గోడౌన్‌ మొదటి అంతస్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అర్ధరాత్రి 12. 30 సమయంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటానా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ANI Tweet:

రెండు వారాల కిందట ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 43 మంది మృతిచెందగా, మరో 50 మంది గాయపడ్డారు. డిసెంబరు 8న ఉదయం 5.30 ప్రాంతంలో స్కూల్ బ్యాగులు, బాటిల్స్, ఇతర వస్తువులు తయారుచేసే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతిచెందినవారిలో అధికశాతం కార్మికులే. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవారే. అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరగడంతో ఎక్కువ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పుడు మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement