Chief Minister of Delhi Arvind Kejriwal met the injured admitted at LNJP hospital (photo-ANI)

New Delhi, December 8: ఢిల్లీ(Delhi)లోని అనాజ్ మండీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం(Delhi Fire Incident)లో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) సందర్శించారు. అక్కడి సహాయక చర్యలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఇది చాలా బాధాకర ఘటన. దీనిపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. LNJP hospitalలో చికిత్స పొందుతున్న బాధితులను ఢిల్లీ సీఎం పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యసేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు.

Delhi fire incident

అలాగే, గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున అందిస్తామని, వారికి ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందిస్తాం' అని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రమాద ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.అత్యవసర సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా జాగ్రత్త పడాలని అధికారులకు ఆయన సూచించారు. ఢిల్లీ ప్రమాద ఘటనకు గల కారణాలు దర్యాప్తులో తేలుతాయని ఢిల్లీ సర్కారు పేర్కొంది. ప్రమాదం ఎవరు చేసినా ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తప్పవని ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పష్టంచేశారు.

Here's the tweet:

ఝాన్సీ రోడ్‌( Rani Jhansi Road)లో ఉన్న పరిశ్రమ 600 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఉదయం 5.22 గంటలకు ప్రమాదం జరిగి ఉంటుంది. ఆ సమయంలోనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ వచ్చింది. అగ్నిప్రమాదం జరిగే సమయంలో ఫ్యాక్టరీలో 25 మంది నిద్రిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

కూలీలు రాత్రి అక్కడే పడుకొన్నారని చెప్పారు. అయితే మృతుల సంఖ్య పెరగడంతో అందులో ఎంతమంది ఉన్నారనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. మంటలను పూర్తిగా ఆపివేశామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి, రాం మనోహర్ లోహియా ఆస్పత్రి, హిందురావు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ కిషోర్ సింగ్ మాట్లాడుతూ గాయపడిన వారి పరిస్థితి తీవ్రంగా లేదని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 34 మందిని ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వారిని వైద్య సహాయం కోసం వార్డులకు తరలించారు. పొగ పీల్చడం వల్ల ఊపిరి ఆడటక పోవడం(Smoke Inhalation & Suffocation)తో మరణాలు ఎక్కువగా జరిగాయని సింగ్ అన్నారు.

భారీ అగ్నిమాపక సంఘటన గురించి ఢీల్లీ పీఆర్ఓ ఎంఎస్ రాంధావా వివరాలు ఇస్తూ.. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కనిపించినట్లు మొదటిసారిగా తెలిసింది. ప్లాస్టిక్ పదార్థాలు అక్కడికక్కడే ఉన్నాయని, ఇది చాలా పొగను కలిగించిందని ఆయన అన్నారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశామని, ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్స్ బృందం త్వరలోనే అక్కడికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.