Delhi Shocker: పోర్న్ వీడియోలకు బానిసైన భర్త, ప్రతి రాత్రి పోర్న్ స్టార్‌లా ముస్తాబై దగ్గరకు రావాలని భార్యకు వేధింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త తన భార్య పట్ల ఉన్మాదిలా ప్రవర్తించాడు. భార్యను పోర్న్ వీడియోలు చూడమని ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా పోర్న్ స్టార్ లా దుస్తులు ధరించాలంటూ బలవంతం చేశాడు. భర్త వేధింపులు తాళలేని ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది.
New Delhi, July 5: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త తన భార్య పట్ల ఉన్మాదిలా ప్రవర్తించాడు. భార్యను పోర్న్ వీడియోలు చూడమని ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా పోర్న్ స్టార్ లా దుస్తులు ధరించాలంటూ బలవంతం చేశాడు. భర్త వేధింపులు తాళలేని ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది.
ఈస్ట్ రోహ్ తాస్ నగర్ కు చెందిన దంపతులకు 2020లో వివాహమైంది. అయితే, తన భర్త పోర్న్ వీడియోలకు బానిసయ్యాడంటూ భార్య పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేసింది. తనను కూడా ఆ వీడియోలు చూడాలని, పోర్న్ స్టార్ లా దుస్తులు ధరించాలని బలవంతం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు చెప్పారు. అంతే కాకుండా భర్త సహా అతడి కుటుంబ సభ్యులు తనని కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని కంప్లైంట్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ మీనా ( Rohit Meena)తెలిపారు. ఐపీసీ సెక్షన్ల 498 A (భర్త లేదా భర్త బంధువు ఆమెను క్రూరత్వానికి గురి చేయడం), 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 377 (అసహజ నేరం), 34 కింద కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (షహదర) రోహిత్ మీనా తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందన్నారు. తదుపరి విచారణ కోసం సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు డిజిటల్, ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.