Rachakonda CP Mahesh Bhagwat: బైకుపై వెళుతూ గొడుగు ఓపెన్ చేసింది, గాలి దెబ్బకు అమాంతం కిందపడిపోయింది, ఎవరూ ఇలా చేయకండి అంటూ వీడియోని షేర్ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, వైరల్ అవుతున్న వీడియో

బైకు మీద ఉన్నప్పుడు చేయరాని పనులు చేస్తే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోని (VIdeo) రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ (Rachakonda CP Mahesh Bhagwat) ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

DON'T TRY TO OPEN THE UMBRELLA WHILE ON RIDE (Photo- Rachakonda police Twitter)

Hyderabad, December 21: ఎవరైనా ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైకు మీద ఉన్నప్పుడు చేయరాని పనులు చేస్తే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోని (VIdeo) రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ (Rachakonda CP Mahesh Bhagwat) ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్ చేసిన వీడియోలో రోడ్డు మీద ఓ జంట బైకుమీద వెళుతూ ఉంది. మధ్యలో వెనక కూర్చున్న యువతి ఎండ వస్తుందని గొడుగు ఓపెన్ (UMBRELLA)చేయబోయింది. అయితే బైకు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో యువతి గొడుగును ఓపెన్ చేయడం వల్ల ఒక్కసారిగా కిందపడిపోయింది. గొడుగుతో పాటుగా గాలి దెబ్బకు అమాంతం బైకు మీద నుంచి కొందకు జారిపడటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆమెకు ప్రథమ చికిత్స అందించారు.

Here's Video

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు ఎండ నుంచి రక్షణగా ఎట్టి పరిస్థితుల్లోనూ గొడుగును ఓపెన్ చేయకండి అనే ట్యాగ్ లైన్ తో రాచకొండ పోలీస్ కమిషనర్ (Rachakonda Police Commissioner ) మహేశ్ భగవత్ ట్వీట్టర్‌లో షేర్ చేశారు.డ్రైవింగ్ చేస్తుండగా.. గొడుగులు వినియోగించరాదని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ వీడియోను పలువురు ట్వీట్ చేస్తూ.. వైరల్‌ చేస్తున్నారు. ఈ వీడియో ఎంత ప్రమాదకరంగా ఉందో చూస్తేనే తెలుస్తోంది కదా.. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.