Earthquake In Hyderabad: వీడియోలు ఇవిగో..హైదరాబాద్,ఖమ్మం, వరంగల్‌లో భూకంపం, భూ ప్రకంపనల ధాటికి కూలిన ఇల్లు గోడ, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు
ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి ఏటూరు నాగారంలో ఇల్లు గోడ కూలిపోయింది.
Hyd, Dec 4: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి ఏటూరు నాగారంలో ఇల్లు గోడ కూలిపోయింది.
హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ , వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హఠాత్తుగా భూమి కంపించటంతో ప్రజలు హడలిపోయారు. అసలేం జరగుతోందో అర్థం కాక.. భయంతో వణికిపోయారు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి
Here's Video:
కొన్ని చోట్ల ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవంతో ప్రజలు హడలిపోయారు. హైదరాబాద్ లో వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. భూమి లోపల 40 కి.మీ లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని అధికారులు తెలిపారు.
Here's Tweet: